మూడడుగుల బెల్లెట్
అతను క్రికెట్ మైదానంలో ఉంటే ఆట మన వైపే ఉంటుందన్ననమ్మకం. అతన్ని అవుట్ చేయాలంటే ఎంత చేయి తిరిగిన బౌలర్‌కు అయినా కష్టం. టెస్ట్ మ్యాచ్‌లో గంటల తరబడి ఆడగల శక్తి సామర్థ్యాలు ఏకైక క్రికెటర్ రాహుల్ ద్రవిడ్. అయితే ద్రవిడ్ గంటల తరబడిన కొట్టే పరుగులను ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ నిమిషాల్లో కొట్టేస్తున్నాడు. భూమికి మూడడగులు కూడా లేని ఈ సమిత్ వందల పరుగులు ఒంటిచేత్తో చేస్తున్నాడు. గట్టిగా పదేళ్ల వయసు ఉందో లేదో.. అప్పుడే అండర్ -14 క్లబ్ క్రికెట్లో సెంచరీ బాదేశాడు. బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ ద్రవిడ్.. టైగర్ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూలు జట్టుపై 125 పరుగులు చేశాడు. అందులోనూ 12 బౌండరీలున్నాయి.
బీయూసీసీ తరఫునే ఆడుతున్న మరో ఆటగాడు ప్రత్యూష్ 143 నాటౌట్‌గా నిలిచాడు. వీళ్లిద్దరూ చెలరేగడంతో బీయూసీసీ జట్టు 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది. సమిత్ ద్రావిడ్ ఇలా చెలరేగి ఆడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అండర్ -12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ టోర్నమెంటులో అతడు బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. అప్పుడు వరుసగా 77 నాటౌట్, 93, 77 చొప్పున పరుగులు చేసి, తన జట్టును గెలిపించాడు. సమిత్ ద్రవిడ్ ఆట తీరును గమనిస్తున్న సీనియర్ క్రికెటర్లు మాత్రం సమిత్‌కు మంచి భవిష్యత్ ఉందని, త్వరలోనే అతను భారత జట్టుతరుపున ఆడుతాడనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.