ఆలీ ప్లేస్ లోకి సంపూర్ణేష్ బాబు..?
మా టీవీ నిర్వహించే సినిమా అవార్డ్స్ ఫంక్షన్ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. అలాగే ఆ సందర్భంగా చూపించే మినీ మూవీకి కూడా సూపర్ క్రేజ్ ఉంటుంది. ఈ అవార్డులు ఇవ్వడం ప్రారంభించిన దగ్గర నుంచి ఆలీ-సుమ యాంకర్స్ గా ఉన్నారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవల బూతులు మాట్లాడుతున్నారనే విమర్శలు ఆలీ మీద ఎక్కువగా వినిపించాయి. దీంతో ఆయన యాంకరింగ్ కి కాసింత డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇదే ఎఫెక్ట్ మా అవార్డ్స్ వేడుకపైనా కూడా పడినట్లుంది.
ఈ నెలలోనే మా టీవీ అవార్డ్స్ అంటూ సదరు ఛానెల్ ఓ ప్రోమోను విడుదల చేసింది. ఇందులో బాహుబలి స్పూఫ్ ని బాగా తీశారు. సుమ ఈ స్పూఫ్ లో కళామతల్లిగా, శివగామిగా కనిపించారు. అలాగే బాయిలింగ్ స్టార్ పృథ్వీ రాజ్ కట్టప్ప పాత్రలో అలరించారు. బాహుబలిగా పైరసీకేయగా సంపూర్ణేష్ బాబు కనిపించనున్నారు. అయితే సంపూర్ణేష్ బాబు చేసిన ఆ పాత్రలు మామూలుగా అయితే ఆలీ చేయాల్సి ఉంది. కాని ఎందుకనో ఆ ఛాన్స్ సంపూను వరించింది. ఆలీ స్వచ్ఛదంగా తప్పుకున్నాడో.. లేక మా టీవీ వాళ్ళే తప్పించారో తెలియదు గాని.. ఆలీ లేకపోయే సరికి ఆయన అభిమానులు కాస్త అంసతృప్తితో ఉన్నారని టాలీవుడ్ టాక్. మరి అవార్డుల ఫంక్షన్ లో.. యాంకరింగ్ లో ఆలీ కనిపిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.