సమస్యాపూరణము
శంకరాభరణం వారిచ్చిన సమస్య
” తాత్పర్యము బోధపడదు తత్వజ్ఞులకున్ ”
కందపద్య పాదమున గల సమస్యకు నాపూరణములు
1.
తత్పరతయెలే కున్నను
తాత్పర్యము బోధపడదు, తాత్వజ్ఞులకున్
సత్పథమీ భువిలోన ప
రాత్పరు సేవింప భవహరమ్మని తెలియున్
2.
ఉత్పథ పథునకు జీవన
తాత్పర్యముబోధపడదు, తత్వజ్ఞునకున్
తత్పరతయె లోపించిన
సత్పథమేజిక్కదనుట సత్యము సుమ్మీ
విరించి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.