ఆ ఆనందమే వేరప్ప!
‘‘ప్రతి సినిమాకు వందకు నూటపది రూపాయిలు ఖర్చు పెట్టే మా నాన్న ఈ సినిమా కోసం నూట యాబై ఖర్చు చేశారు. ఎందుకు నాన్న అంత ఖర్చు చేశావని అడిగితే రూ.150లకు రూ.300లు వస్తుందనే నమ్మకం ఉంది అందుకే ఖర్చు పెట్టాను అన్నారు. ఆయన నమ్మకాన్ని బోయపాటి శ్రీను నిజం చేశారు’’ అని స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ‘సరైనోడు’ బ్లాక్‌బస్టర్ హిట్ కావడం చాలా సంతోషంగా ఉందంటున్నాడు. ‘‘నా కెరీర్లో ఎన్ని హిట్ సినిమాలైనా చెయొచ్చు. కానీ మా నాన్న బ్యానర్లో అందుకున్న విజయం నుంచి పొందే ఆనందం మరెక్కడా దొరకదు. సొంత సంస్థలో 100 కోట్ల క్లబ్‌కి చేరడం, నా సినిమాల్లో ది బెస్ట్‌గా ‘సరైనోడు’ చిరంజీవి గురించి చెబుతూ ‘‘చిన్నప్పటి నుంచి చిరంజీవిగారి సినిమాలు చూసి పెరిగాను. ఆయన ప్రభావం నాపై చాలా ఉంటుంది. ఇటీవల ఆయన 150వ సినిమా ప్రారంభానికి వెళ్లాను. ఆ సినిమా రూ.150 కోట్లు గ్రాస్ వసూలు చేయాలని మనసారా కోరుకుంటున్నానని వినాయక్‌గారికి చెప్పాను’’ అని తెలిపారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘‘నేను అశ్వినీదత్ కలిసి నిర్మించిన పెళ్లిసందడి’ చిత్రం 175 రోజుల వేడుక విజయవాడలో చేశాం. మళ్లీ ఇప్పుడు ‘సరైనోడు’ విజయ సంబరాన్ని ఇక్కడ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.