Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sardaar Gabbar Singh’s making video raises expectations.. Video..

By   /  March 13, 2016  /  Comments Off on Sardaar Gabbar Singh’s making video raises expectations.. Video..

    Print       Email

Sardaar-Gabbar-Singh

పవర్ స్టార్ స్టైల్ అదిరింది..!

InCorpTaxAct
Suvidha

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ ‘సర్ధార్’. ఈ మూవీ ‘గబ్బర్ సింగ్’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికోసం పవన్ చాలా కష్టపడుతున్నారు. ఇక ఫస్ట్ లుక్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందో కూడా తెలిసిన విషయమే. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ గురించి కూడా అభిమానులు చాలా ఆశక్తిగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మూవీకి సంబంధించిన విశేషాలు రిలీజ్ అవుతాయా.. అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

 

మూవీ యూనిట్ పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కోసం ఓ మేకింగ్ వీడియోని శనివారం విడుదల చేసింది. ఆ వీడియో ఎలా ఉందంటే.. సినిమా రిలీజ్ కోసం మరింత ఉత్సాహంగా ఎదురు చూడటం ఖాయం అన్నట్లుగా ఉంది. పవన్ కల్యాణ్ రివాల్వర్ తిప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే సర్ధార్ అని బైక్ మీద కనిపించే అక్షరాలు, పవన్ లుక్, స్టైల్ అన్నీ సూపర్బ్ గా ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ సరసన అందాల ముద్దుగుమ్మ కాజల్ నటిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్ 8న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →