సరిగమలు గలగలలు …సరిగమలు గలగలలు

చిత్రం-ఇది కథ కాదు(1979)
సంగీతం-ఎం.ఎస్.విశ్వనాథన్
గానం-ఎస్.పి.బాలు, పి.సుశీల
రచన-ఆచార్య ఆత్రేయ
********
విశేషాలు–ఇది కథ కాదు, 1979లో విడుదలైన ఒక తెలుగు సినిమా. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన ఈ నలుపు-తెలుపు సినిమా పెద్ద హంగులు, తారాగణం లేకపోయినా గాని అద్భుతమైన విజయం సాధించింది. విభిన్నమైన మనస్తత్వాలను దర్శకుడు చాలా నైపుణ్యంతో తెరకెక్కించాడు. “వెంట్రిలోక్విజమ్” ద్వారా ఒక వ్యక్తి భావాలు తెలియబరచడం దర్శకుడు చేసిన ప్రయోగం. చివరి ఘట్టంలో హీరోయిన్ “గొంతు నీదేనని తెలుసు. కాని భావం కూడా నీదేనని తెలుసుకోలేకపోయాను” అంటుంది. ఇది చక్కని డైలాగ్.ఈ సినిమాకు మాటలు వ్రాసింది గణేష్ పాత్రో.పాటలన్నిటినీ ఆత్రేయ వ్రాసారు.పాటలన్నీ రసగుళికలే! చిరంజీవి ప్రతినాయకునిగా నటించిన కొద్ది సినిమాలలో ఇది ఒకటి.జయసుధ నటనా ప్రతిభకు అద్దం పట్టే సినిమాల్లో ఇదొకటిటి.తమిళంలో నిర్మింపబడ్డ ‘అవర్ గళ్’ (వారు) ఈ చిత్రానికి మూలం.తమిళంలో నాయికగా సుజాత నటించింది.చిరంజీవి పాత్రని తమిళంలో రజినీకాంత్ పోషించారు.మిమిక్రీ కళాకారుడిగా రెండు భాషల్లోనూ కమల్ హాసన్ నటించటం విశేషం.
*************
సరిగమలు గలగలలు …సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము…ప్రియురాలే నాట్యము
చెలికాలి మువ్వల గల గలలూ
చెలి కాలి మువ్వల గల గలలూ
చెలికాని మురళిలో….
సరిగమలు గలగలలు …సరిగమలు గలగలలు
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
ఆవేశమున్నది ప్రతి కళలో
అనుభూతి ఉన్నది ప్రతి హృదిలో
కదలీ కదలక కదిలించు కదలికలు
కదలీ కదలక కదిలించు కదలికలు
గంగా తరంగాల శృంగార డోలికలు
సరిగమలు గలగలలు …సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము…ప్రియురాలే నాట్యము
హృదయాలు కలవాలి ఒక శ్రుతిలో
బ్రతుకులు నడవాలి ఒక లయలో
శృతిలయలొకటైన అనురాగ రాగాలు
జతులై జతలైన నవరస భావాలు
సరిగమలు గలగలలు …సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము…ప్రియురాలే నాట్యము
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
నయనాలు కలిశాయి ఒక చూపులో
నాట్యాలు చేశాయి నీ రూపులో
రాధనై పలకనీ నీ మురళి రవళిలో
పాదమై కదలనీ నీ నాట్య సరళిలో
సరిగమలు గలగలలు …సరిగమలు గలగలలు
ప్రియుడే సంగీతము…ప్రియురాలే నాట్యము…
ఈ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=kZitXu1fylU వినండి !
టీవీయస్.శాస్త్రి
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.