Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sasikala gets special treatment in Jail

By   /  March 9, 2018  /  Comments Off on Sasikala gets special treatment in Jail

    Print       Email

సిద్ధ‌ప్ప‌.. ఇది ఏంద‌ప్పా!

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* దుమారం రేపుతున్న చిన్న‌మ్మ జైల్ వ్య‌వ‌హారం

* శ‌శిక‌ళ‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నారంటూ సిద్ధ‌ప్ప‌పై విమ‌ర్శ‌లు

* సీఎంను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయ‌త్నాలు

డెక్క‌న్ అబ్రాడ్‌: అస‌లే ద‌క్షిణాధి రాష్ట్రాల‌పై త‌మ ప్రాబ‌ల్యం లేద‌ని, ఇక్క‌డ పాగా వేయాల‌ని భార‌తీ జ‌న‌త‌పార్టీ ఎప్పుటి నుంచో చూస్తోంది. ఎలాగైనా ద‌క్షిణాదిన అధికారంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇలాంటి నేప‌థ్యంలో వ‌చ్చిన ప్ర‌తి చిన్న అవ‌కాశాన్ని బీజేపీ వ‌దులుకోవ‌డం లేదు. క‌ర్ణాట‌కలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గెలిచేందుకు స‌ర్వ‌శ‌క్తులు వ‌డ్డుతోంది. అయితే `వెత‌క‌బోయే తీగ కాలికి త‌గిలిన‌ట్లుగా` బీజేపీ నాయ‌కుల‌కు ఒక ఆయుధం దొరికింది. సిద్ధ సర్కారుపై వేలెత్తి చూపించేందుకు వీలుగా చిన్నమ్మ వ్యవహారం తాజాగా తెర మీదకు వచ్చింది. అమ్మ(జ‌య‌ల‌లిత‌) నెచ్చెలి శశికళకు అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష పడటం తెలిసిందే. ఆమె కర్ణాటకలోని పరప్పన అగ్రహర జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. ఆమెకు జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్న వైనం తాజాగా బయటకు వచ్చింది. జైల్లో చిన్నమ్మకు అన్ని వసతులు కల్పిస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాఫ్తు చేస్తున్న కమిటీకి సత్యనారాయణ అనే మాజీ పోలీసు ఉన్నతాధికారి చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది.  చిన్నమ్మకు ఖరీదైన పరుపు.. దిండ్లతో పాటు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లుగా ఆయన చెప్పారు. ఇందుకు సిద్ధరామయ్య కూడా మాట సాయం చేశారన్న మాట ఇప్పుడు ఆయన్ను ఇరుకున పెట్టేలా చేస్తోంది.

సిద్ధ పాలనా వైఫల్యం కింద ఆయనపై విమర్శల దాడి చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. చిన్నమ్మకు ప్రత్యేక వసతులు కల్పించటం కోసం రూ2 కోట్లు ఆమె రావటానికి ముందే అందినట్లుగా రూపా అనే పోలీసు అధికారి గతంలో బయటపెట్టిన నేపథ్యంలో సత్యనారాయణ మాట కర్ణాటక ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. అన్నిచోట్ల అపజయం ఎదురువుతున్న వేళ.. కనీసం కర్ణాటకలో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే  సర్వశక్తులు ఒడ్డి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న  పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. క‌ర్ణాట‌క‌లో ఎవ‌రు పాగా వేస్తారో వేచి చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →