ఆర్.కె.నగర్ ప్రచారంలో జయ శవపేటిక మోడల్.. తమిళనాట కలకలం..
ఆర్.కె.నగర్ అసెంబ్లీ బై ఎలక్షన్ లో ప్రచారం కోసం తమిళనాడు దివంగత సీఎం జయలలిత ప్రతిమ ఉన్న శవపేటిక మెడల్ ను వినియోగించడం తమిళనాట కలకలం రేపింది. జయ మరణంపై దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ వినిపించేలా మాజీ సీఎం పన్నీరుసెల్వం వర్గీయులు ఈ మోడల్ ను ప్రచారంలో ఉంచారు. వారు ఓపెన్‌టాప్ జీపు ముందు భాగంపై ఉంచి తమ అభ్యర్థి ఇ.మధుసూదనన్ తరఫున ప్రచారం చేశారు. మధుసూదన్ గెలిస్తే జయ మరణంపై దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ కు బలం వస్తుందని ఓటర్లను కోరారు. పన్నీరు వర్గీయులపై శశికళ వర్గీయులు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ మేరకు నిరసన తెలపడంతో పన్నీరుసెల్వం వర్గీయులు ఆ మోడల్ ను తొలగించారు. పన్నీరుసెల్వం వర్గంపై చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నేతలు డిమాండ్ చేశారు. వారు రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.