Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sasikala wrote letter to AIADMK leaders..

By   /  February 23, 2017  /  Comments Off on Sasikala wrote letter to AIADMK leaders..

    Print       Email

sasikala-in-jailజయ చనిపోయి నన్ను ఒంటరి దాన్ని చేసింది.. ఆవేదన వ్యక్తం చేసిన శశికళ..

 

InCorpTaxAct
Suvidha

 

 

అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు సుప్రీంకోర్టు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. రీసెంట్ గా శశికళ ఓ లేఖను విడుదల చేశారు. జయ లలిత చనిపోయి తనను ఒంటరిదాన్ని చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 24న జయలలిత పుట్టినరోజు. ఆమె జయంతి రోజున పార్టీ నేతలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని శశికళ కోరారు.

ఈ సందర్భంగా జయలలితతో తనకున్న అనుబంధాన్ని శశికళ గుర్తు చేసుకున్నారు. ప్రతీ పుట్టినరోజుకు జయలలితతో తాను పక్కనే ఉండేదాన్నని తెలిపారు. కానీ ఈ పుట్టిన రోజున అమ్మ మన మధ్య లేకపోవడం బాధాకరమని శశికళ లేఖలో పేర్కొన్నారు. తన ఆలోచలన్నీ అమ్మ చుట్టూనే తిరుగుతున్నాయని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జయలలిత ఎన్నో శ్రమపడ్డారని తెలిపారు. జయ అన్నీతానై అన్నాడీఎంకేను బతికించిందని చెప్పుకొచ్చారు. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత పార్టీని కాపాడిన ఒకేఒక్క ధీర వనిత జయలలిత అంటూ శశికళ ప్రసంసించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →