Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sasikala’s husband passes away

By   /  March 20, 2018  /  Comments Off on Sasikala’s husband passes away

    Print       Email

శ‌శిక‌ళ భ‌ర్త క‌న్నుమూత‌

InCorpTaxAct
Suvidha

 

 

* 15 రోజుల పెరోల్‌పై శ‌శిక‌ళ విడుద‌ల‌

డెక్క‌న్ అబ్రాడ్‌: చిన్నమ్మ (శ‌శిక‌ళ‌) భ‌ర్త ఎం.న‌ట‌రాజ‌న్ (74) సోమ‌వారం అర్ధ‌రాత్రి 1.35 గంట‌ల‌కు క‌న్నుమూసిన‌ట్లు చెన్నైలోని గ్లెన్ ఈగ‌ల్స్ గ్లోబ‌ల్ హెల్త్‌సిటీ ఆస్ప‌త్రిలో వ‌ర్గాలు తెలిపాయి. గ‌త కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న న‌ట‌రాజ‌న్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు మీడియాకు తెలిపాయి.  న‌ట‌రాజ‌న్ మ‌ర‌ణించ‌డంతో శశికళ‌కు 15 రోజుల పెరోల్ మంజూరయ్యింది. భర్త నటరాజన్ చనిపోయాడని సమాచారం తెలుసుకున్న చిన్నమ్మ శశికళ కన్నీరుమున్నీరయ్యారు. అక్రమాస్తుల కేసులో కర్ణాటక పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మరోసారి 15 రోజుల పెరోల్‌కు దరఖాస్తు చేశారు. ఆమె అభ్యర్థన మేరకు జైళ్ల శాఖ అధికారులు కొన్ని షరతులతో 15 రోజుల పెరోల్‌‌కు అనుమతించారు. పెరోల్‌పై విడుదలయ్యాక ఆమె తంజావూరులో మాత్రమే గడపాలని…చెన్నైకి వెళ్లకూడదని జైళ్ల శాఖ అధికారులు షరతు విధించారు.

అలాగే కేవలం వ్యక్తిగత పనుల కోసమే ఈ అవకాశాన్ని వాడుకోవాలని, రాజకీయ కార్యక్రమాలకు గాని, వ్యవహారాల జోలికి కానీ వెళ్లకూడదని శశికళను సూచించారు. దీంతో పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలైన ఆమె..భర్త అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాగా  గత ఏడాది అక్టోబరులో ఆయనకు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు మూత్రపిండాలను మార్చారు. అయితే, మార్చినా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించకపోగా.. ఆయన మరింత అనారోగ్యం పాలయ్యారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Prayer to protect from Corona Virus

Read More →