నందమూరి తారకరామారావుకు తాను పెద్ద ఫ్యాన్‌ను అని, ఆ మహానుభావుడి కొడుకు నందమూరి బాలకృష్ణ నటించే 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని తాను కుటుంబ సమేతంగా వచ్చి చూస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుఅన్నారు. బాలకృష్ణ నటించే వందో సినిమా`గౌతమీ పుత్ర శాతకర్ణి` షూటింగ్‌ను శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన కేసీఆర్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ నందమూరి తారకరామారావును అభిమానించని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదన్నారు. గౌతమీ పుత్ర శాతకర్ణి కథతో తన వందో సినిమా తీయాలని బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం గొప్పదన్నారు. బాలకృష్ణకు ఈ చిత్రం విజయవంతం కావాలని నా దీవెనలు అందిస్తున్నానని చెప్పారు. ఈ వందో సినిమా 200 రోజులు ఆడుతుందని చెప్పారు.
ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అలాగే ఉంటుందని, ఆయన ఏ జ్ఞాపకాన్నైనా పదిలంగా కాపాడుకుంటామని చెప్పారు. ఎన్టీఆర్ అంటే ఒకే తరం నటుడు కాదని చెప్పారు. తెలుగు జాతి గొప్ప బిడ్డ అని కొనియాడారు. వందో సినిమా షూటింగ్ ప్రారంభం కాగానే తొలిసారి తొలి ఆట చూసే అవకాశం తమకు ఇవ్వాలని, కుటుంబ సమేతంగా చిరంజీవి, వెంకటేశ్ తో కలిసి ఈ సినిమా చూస్తానని చెప్పారు. కార్యక్రమం రాజకీయ, సీని ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణ సినిమాటోగ్రఫి తలసాని శ్రీనివాసయాదవ్, మెగాస్టార్ చిరంజీ, విక్టరీ వెంకటేష్, డైరెక్టర్లు రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు తదితరులు పాల్గొని బాలకృష్ణకు, డైరెక్టర్ క్రిష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం వంద శాతం విజయవంతం అవుతుందని వారు పేర్కొన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.