శివరాత్రి కానుకగా సతీ తిమ్మమాంబ’
ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై బాలగొండ ఆంజనేయులు డైరెక్షన్ లో భవ్యశ్రీ మెయిన్ క్యారెక్టర్ లో నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మించిన సినిమా ‘సతీ తిమ్మమాంబ’. ఈ సినిమా భారీ గ్రాఫిక్స్ తో రూపుదిద్దుకుంది. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
భవ్యశ్రీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో వెంకట్, వినోద్ కుమార్, ప్రభాకర్, రంగనాధ్, చంద్రమోహన్, రాజశ్రీ , జూనియర్ రేలంగి ప్రధాన తారాగణం. ఈ సినిమాకి సంగీతం: బండారు దానయ్యకవి, కెమెరా: షాహిద్ హుస్సేన్, పాటలు: బండారు దానయ్యకవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్: వినయ్, దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్. రామ్‌కుమార్, నిర్మాత: పెద్దరాసు సుబ్రమణ్యం, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.
డైరెక్టర్ బాలగొండ ఆంజనేయులు సినిమా విశేషాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో ఎంతో విశిష్టత కలిగిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రమని వివరించారు. ఈ సినిమా నిర్మాణం కోసం నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యంగారు అందించిన సహకారం మరిచిపోలేమన్నారు. అలాగే నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం చాలా కష్టపడి పనిచేశారని తెలిపారు. సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తైనట్లు తెలిపారు. మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
నిర్మాత పెద్దరాసు సుబ్రమణ్యం మాట్లాడుతూ.. సుమారు 600 వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను సినిమాగా తెరకెక్కించినందుకు ఎంతగానో ఆనందంగా ఉందన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో .. ఈ మర్రిమాను చోటు సంపాదించుకుంది అంటే..ఈ మానుకు ఎటువంటి చరిత్ర ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఆ చరిత్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించామన్నారు. మహాశివరాత్రికి ఈ తిమ్మమాను దగ్గర పెద్ద జాతర జరుగుతుంది. ఈ జాతరకు ‘థేరు’ ఉత్సవంగా పేరుంది. సుమారు మూడు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. తిమ్మమ్మ అత్తింటి వారు శైవులు. అంటే శివుని ఆరాధించేవారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజల శివనామస్మరణతో ఈ మూడు రోజుల ఉత్సవం ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. ఈ విశిష్టతను పురస్కరించుకునే..మా ఈ ‘సతీ తిమ్మమాంబ’ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.