Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sensational movie posters of Telugu stars on Ugadi

By   /  April 9, 2016  /  Comments Off on Sensational movie posters of Telugu stars on Ugadi

    Print       Email

venkateshఉగాది రోజున ముచ్చ‌ట‌గా మూడు పోస్ట‌ర్లు

 

InCorpTaxAct
Suvidha

దుర్ముఖినామ సంవ‌త్స‌రం ఉగాది సంద‌ర్భంగా ప్ర‌ముఖ హీరోలు  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, విక్ట‌రీ వెంక‌టేష్‌..నితిన్ వంటి వారు వాళ్ల సినిమా పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు. సినిమాపై మ‌రింత అంచ‌నాలు పెంచేలా చేశారు. బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో మ‌హేష్ చెప్పులు తొడుగుతూ ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసి ప్రేక్ష‌కుల ముందు పెద్ద క్వ‌చ్ఛ‌న్ మార్కును పెట్టాడు. అందులో ఉండేది ఎవ‌రో తెలుసుకోవాలంటే మాత్రం ఆ సినిమా చూడాల్సిందే.

ఇక విక్ట‌రీ వెంక‌టేష్ కూడా ఉగాది సంద‌ర్భంగా తాను న‌టించ‌బోయే బాబు బంగారం సినిమా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ సినిమాలో వెంక‌టేష్ చాలా గ్లామ‌ర్‌గా క‌నిపిస్తున్నార‌ని, ఈ సినిమా త‌ప్ప‌కుండా భారీ విజ‌యం సాధిస్తుంద‌ని అభిమానులు ఆనంద‌ప‌డిపోతున్నారు.  కామెడీ పోలీస్ అధికారి పాత్ర‌లో వెంక‌టేష్ న‌టిస్తుండ‌గా.. ఆయ‌న స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తోంది.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ‘అ ఆ’ సినిమా పోస్ట‌ర్‌ను కూడా ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.  ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ట్యాగ్ లైన్ వ‌స్తున్న ఈ సినిమాలో  నితిన్ న‌టిస్తుండ‌గా.. ఆయ‌న స‌ర‌స‌న స‌మంత న‌టిస్తోంది. ఉగాది రోజున విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌కు  మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నితిన్ డిసెంట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →