మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్సనాలిటీస్ గా షారూఖ్ – ప్రియాంక
ద టైమ్స్ – ట్విట్టర్ సంయుక్తంగా ఓ లిస్ట్ ని విడుదల చేశాయి. అదేంటంటే.. గత ఏడాది ట్విట్టర్లో అత్యధిక ప్రభావం చూపిన వ్యక్తుల జాబితా. అంటే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పర్సనాలిటీస్ లిస్ట్ అన్నమాట. ఇందులో షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా టాప్ ప్లేస్ లో నిలిచారు. రెండు అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ఈ తరహా సర్వే చేయడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. సాధారణంగా ట్విట్టర్ రేటింగ్స్ సెలబ్రెటీల ఫాలోవర్ల సంఖ్యను బట్టి ఉంటుంది. అయితే ఇది దానికి భిన్నంగా ఉంది. ఫాలోవర్లపై ఈ సెలెబ్రిటీల ప్రభావం ఎంత ఉంది అన్నది తెలిసేలా ప్రపంచస్థాయి డాటా మదింపు పరికరాలు వాడి ఈ సర్వే ఫలితాలను రిలీజ్ చేశారు. ఇక్కడ ఫాలోవర్స్ కలిగివుండడం మాత్రమే వారిపై ప్రభావం ఉంటుందనడానికి నిదర్శనం కాదు. ట్విట్టర్ చాలా శక్తిమంతమైన మాధ్యమం. ఇందులో ఎప్పటికప్పుడు తాజా అంశాలపై చర్చలు జరుగుతూంటాయి. ఈ చర్చలు వైరల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి మాధ్యమంలో.. రీట్వీట్స్, లైక్స్, రిప్లైస్ .. వీటి ద్వారా ఎంతగా ఇతరులను ప్రభావితం చేశారనే దాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ వ్యక్తి ప్రభావాన్ని అంచనా వేస్తారు. ఫాలోవర్స్ చాలామంది ఉంటే సరిపోదు.. వారిని ఎంతగా తమ ట్వీట్లతో ఎంగేజ్ చేశామన్నది ఇంపార్ట్ టెంట్ అన్నమాట.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.