అమెరికాలో షారూఖ్ కు చేదు అనుభవం..!
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్కు అమెరికాలో మళ్ళీ చేదు అనుభవం ఎదురైంది. లాస్ఏంజిల్స్ లోని ఎయిర్ పోర్టు అధికారులు షారూక్ ఖాన్ ను నిర్బంధించారు. అంతేకాకుండా వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. గడచిన ఏడేళ్లలో బాద్ షాను అడ్డుకోవడం ఇది మూడోసారి. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు షారుక్ పేరుపై అనుమానంతో ఆయన్ను నిర్బంధించి ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత జరిగిన పోరపాటు వారికి అర్ధమైంది. దీంతో షారూఖ్ ను క్షమాపణలు కోరారు. తనను నిర్భంధించడంపై కింగ్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.అగ్రదేశంలో పలుమార్లు ఇలా జరగడం ఏ మాత్రం బాగుండలేదని వాపోయారు. ఏ దేశంలో అయినా భద్రతా నియమాలను తాను గౌరవిస్తానన్నారు. అయితే అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారులు వెళ్లిన ప్రతిసారి అడ్డుచెప్పడం చాలా ఇబ్బందిగా ఉందన్నారు.
అధికారులు షారుక్ను నిర్బంధించిన సమయంలో ‘పోకెమాన్ గో’ గేమ్ ఆడుతూ కాలం గడిపారట. వేచి ఉన్న సమయంలో పోకెమాన్లను పట్టుకోవడం కాస్త సంతోషం కలిగించే అంశమేనంటూ మరో ట్వీట్ లో వెల్లడించారు. మరోవైపు.. కింగ్ ఖాన్ ను నిర్భధించినందుకు క్షమాపణలు కోరుతున్నట్లుగా అమెరికా అధికారి నిశా దేశాయ్ బిశ్వాల్ ట్వీట్ చేశారు.2009లో నీవార్క్ ఎయిర్ పోర్టులో ఒకసారి, 2012 ఏప్రిల్లో న్యూయార్క్ వైట్ప్లైన్స్ ఎయిర్ పోర్టులో మరోసారి.. గతంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు షారూఖ్ ను అడ్డుకున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.