Loading...
You are here:  Home  >  Movies  >  Bollywood  >  Current Article

Shah Rukh Khan In Dual Roles As Star And (Much Younger) Stalker..

By   /  March 3, 2016  /  Comments Off on Shah Rukh Khan In Dual Roles As Star And (Much Younger) Stalker..

    Print       Email

sharuk khan in fan movie new

యంగ్ లుక్ లో షారూఖ్..!

InCorpTaxAct
Suvidha

 

షారూక్ ఖాన్ వయసు ఎంత ఉంటుంది..? ఈ మధ్యనే ఆయన 50 ఏటా అడుగుపెట్టారు. కాని రీసెంట్ గా రిలీజ్ అయిన ఫ్యాన్ మూవీలో మాత్రం ఓ 20 ఏళ్ళ కుర్రాడిలా కనిపిస్తున్నారు. అదేంటి ‘దిల్ వాలే’ సినిమాలో ఆయన పెద్దాయన లానే కనిపించాడు కదా..! అనుకుంటున్నారా. కరెక్టే కాని.. ‘ఫ్యాన్’ మూవీలో మాత్రం అచ్చం ఓ టీనేజ్ కుర్రాడిలానే కనిపిస్తున్నారు. అంటే ఓ రేంజ్ లో మేకప్ వేశారన్న మాట అనుకుంటున్నారా..? అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఏమాత్రం ఓవర్ మేకప్ తో కవర్ చేయలేదు. ఓ మాదిరి మేకప్ తోనే యంగ్ హీరో లుక్ లో కనిపిస్తున్నారు బాలీవుడ్ బాద్ షా. ‘ఫ్యాన్’ మూవీ ఏప్రిల్ 15న విడుదల కాబోతోంది.

 

మొన్నటి వరకు ‘ఫ్యాన్’ మూవీ అంటే అభిమాని పాత్రలోనూ హీరో క్యారెక్టర్ లోనూ షారూక్ నటించాడని మాత్రమే తెలుసు. కాని ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అమాంతం సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. హీరో షారూఖ్ అభిమాని పాత్రలో నటించిన షారూఖ్ లుక్ కొత్తగా ఉంది. ఈ సినిమాలో హీరోనే ప్రపంచం అనుకుని బతికే పాత్రలో ఆయన నటించారు. అయితే మరోపాత్ర మాత్రం అభిమానిని నిరాశ పరిచే నెగెటివ్ టచ్ ఉన్న రోల్. ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో షారూఖ్ కనిపించనున్నారు. ‘హ్యపీ న్యూయర్’ బాద్ షా కు కనక వర్షం కురిపించినా అనుకున్నంత పేరు తీసుకురాలేకపోయింది. దీంతో ఈ కింగ్ ఖాన్ ‘ఫ్యాన్’ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక జబ్రా సాంగ్ ని ఏకంగా ఆరు భాషల్లో పాడించారు. ఇలా డిఫరెంట్ గా సినిమాని ప్రమోట్ చేస్తోంది చిత్ర యూనిట్. మరి ఈ హీరోగారికి ఈ చిత్రమైనా మంచి పేరు తీసుకువస్తుందేమో చూడాలి మరి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →