Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Sharwanand Next Movie With Young Director Mahesh..

By   /  February 5, 2016  /  Comments Off on Sharwanand Next Movie With Young Director Mahesh..

    Print       Email

sharwanandయంగ్ డైరెక్టర్ తో మూవీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన శర్వానంద్..?

 

InCorpTaxAct
Suvidha

‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’.. ఈ మూడు సినిమాలు మంచి హిట్ మూవీస్ గా నిలిచాయి. సంక్రాంతి బరిలో హేమా హేమీలతో తలపడినా.. శర్వానంద్ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ మూవీ భారీ హిట్ ని సొంతం చేసుకుంది. దీంతో హీరో శర్వానంద్ హ్యాట్రిక్ కొట్టాడు.అంతేకాదు.. వరుస హిట్స్ తో ఈ కుర్ర హీరో మంచి ఖుషీ ఖుషీగా ఉన్నాడు. ఇంకా ఎక్స్ ప్రెస్ రాజా మూవీ మంచి వసూళ్ళు రాబడుతూ దూసుకుపోతోంది. ఇక నిర్మాతలకు ఆయన మినిమన్ గ్యారెంటీ హీరోగా మారిపోయాడు.

 

ఇదిలాఉంటే.. శర్వానంద్ తన నెక్ట్స్ మూవీపై అప్పుడే దృష్టి పెట్టేశాడు. రీసెంట్ గా ఆయన ఓ యంగ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేశారని టాక్ నడుస్తోంది. సందీప్ కిషన్ తో ‘రారా కృష్ణయ్య’ మూవీని తెరకెక్కించిన దర్శకుడు పి.మహేష్. ప్రస్తుతం శర్వానంద్ ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారనేది టాలీవుడ్ టాక్. ఈ మధ్యనే మహేష్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో.. సినిమా చేసేందుకు ఈ యంగ్ హీరో రెడీ అయిపోయాడని సినీ జనాలు చర్చించుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు దర్శకుడు తెగ వర్కవుట్ చేస్తున్నాడని సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →