Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Shiv Sena won’t ally with BJP for 2019 Lok Sabha, Maharashtra assembly polls

By   /  January 23, 2018  /  Comments Off on Shiv Sena won’t ally with BJP for 2019 Lok Sabha, Maharashtra assembly polls

    Print       Email

బీజేపీతో శివసేన కటీఫ్..!

 

InCorpTaxAct
Suvidha

 

 

బీజేపీతో తమ సుధీర్ఘ బందానికి గుడ్ బై చెప్పింది శివసేన. 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేసింది. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం (జనవరి 23) జరిగిన శివసేన జాతీయ కార్యనిర్వహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేత సంజయ్ రౌత్ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ సమావేశంలో నిర్ణయించారు. ఎన్డీయేలో బీజేపీ తర్వాత శివసేన పార్టీదే కీలక పాత్ర.

90వ దశకంలో బీజేపీ, శివసేన కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడిపాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను 150 స్థానాల్లో జయకేతనం ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు శివసేన దిశానిర్దేశం చేసింది. దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారులో కూడా శివసేన భాగస్వామిగా చేరినప్పటికీ.. కొద్ది రోజులకే వీరి మధ్య విభేదాలు వచ్చాయి. అటు కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోడీపై ఫైరయ్యారు శివసేన చీఫ్‌ ఉద్దవ్ థాక్రే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →