Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Show footwear to Chandra Babu!

By   /  June 5, 2016  /  Comments Off on Show footwear to Chandra Babu!

    Print       Email

Jaganబాబు వ‌స్తే చెప్పు చూపించండి

 

InCorpTaxAct
Suvidha

 

 

“రాయ‌ల‌సీమ వాళ్ల‌కు కొంచెం కోపం ఎక్కువ‌. ఏది ఉన్నా మొహంపైనే మాట్లాడేస్తారు. మ‌న‌సులో పెట్టుకోరు. మ‌న ద‌గ్గ‌ర అప్పు తీసుకుని ఇవ్వ‌క‌పోయినా.. మ‌న‌కు చెప్పింది చేయ‌క‌పోయినా మ‌నం వాళ్ల‌ను చెప్పుతో క‌ట్టినా పాపం లేదు అంటాం. మ‌రి ఎన్నిక‌ల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన చంద్ర‌బాబును ఏమ‌నాలి. నేను మాత్రం చెప్పుతో కొట్ట‌మ‌ని అన‌ను. కానీ చంద్ర‌బాబు ఎక్క‌డికి వ‌చ్చినా చెప్పులు మాత్రం చూపించండి. అప్ప‌టికైనా బుద్ధి వ‌చ్చి హామీలు నెర‌వేరుస్తాడేమో చూద్దాం“ అంటూ ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అన్నారు. రైతు భ‌రోయా యాత్ర‌లో భాగంగా అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్ క‌దిరి బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో విరుచుక‌ ప‌డ్డారు. బాబు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాల‌ని.. చేసేవ‌న్నీ మోసాల‌ని మండిప‌డ్డారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక అవ‌స‌రం ఎంతో ఉన్నా ప్ర‌త్యేక హోదా గురించి ఒక్క మాట కూడా మాట్లాడ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నోసార్లు ఢిల్లీకి ఏపీకి ప్ర‌త్యేక విమానాల్లో వెళ్తూ.. వ‌స్తూ త‌న వ్య‌వ‌హారాలు చూసుకున్నారు త‌ప్పితే రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోలేద‌న్నారు.

అది అలా ఉంటే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అక్ర‌మ ప్రాజెక్టుల‌ను అడ్డ‌గోలుగా క‌డుతుంటే ఆ విష‌యం గురించి కూడా ఒక్క మాట మాట్లాడ‌ని బాబు ఏపీకి ముఖ్య‌మంత్రిగా ఉన్నా ఒక‌టే లేకున్నా ఒక‌టేన‌న్నారు. ప్ర‌ధానిని ప్ర‌త్యేక హోదాగురించి.. కేసీఆర్‌ను నీళ్ల గురించి అడిగితే త‌న ఓటుకు నోటు కేసు ఎక్క‌డ బ‌య‌ట‌కు తీస్తారోన‌ని చంద్ర‌బాబు నాయుడు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. కేసీఆర్ అక్ర‌మ ప్రాజెక్టుల వ‌ల‌న రాష్ట్రం ఎడారిగా మారే ప్ర‌మాదం ఉంద‌ని, కింద‌కు ఒక్క చుక్క నీరు రాక‌పోతే తాగ‌డానికి కూడా నీళ్లు దొరికే ప‌రిస్థితే ఉండ‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →