Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Shraddha is expecting compliments for bikini and action scenes

By   /  March 17, 2016  /  Comments Off on Shraddha is expecting compliments for bikini and action scenes

    Print       Email

shraddha kapoor baaghi 3

బికిని,యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ..
స్క్రీన్ మీద శ్రద్ధాకపూర్ లుక్ ఎలా ఉంటుంది..? అని ఎవరినైనా అడిగితే.. ఠక్కున పక్కింటి అమ్మాయిలా ఉంటుందని చెప్పేస్తారు. అయితే బాఘీ ట్రైలర్ చూస్తే మాత్రం రొటీన్ కి భిన్నంగా కనిపిస్తుంది. ట్రైలర్ లో అందాలు ఆరోబోసింది శ్రద్ధా కపూర్. మరోవైపు.. భారీ యాక్షన్ సన్నివేశాల్లో కూడా కనిపించింది. అంతేకాదు.. సినిమాలో ఆమె చేజింగ్స్‌ చేయడంతో పాటు, ఫైటర్లను చితగ్గొడుతుందని చిత్ర బృందం చెబుతోంది.అయితే ఫైట్లు చేయడానికి ఆ భామ పెద్దగా ట్రైనింగ్ ఏమీ తీసుకోలేదట.

InCorpTaxAct
Suvidha

‘షూటింగ్‌ చేసేప్పుడే, యాక్షన్ సీన్ల కోసం ప్రత్యేకంగా రెడీ అవుతూ వచ్చాపని ఈ అందాల తార చెబుతోంది. తన యాక్షన్ సన్నివేశాల ప్రిపరేషన్ కోసం రోజూ కొన్ని గంటలపాటు ప్రాక్టీస్ చేసేవారట. యాక్షన్ సీన్స్ లో కనిపించడం ఫస్ట్ కాబట్టి చాలా కష్టపడ్డానని చెబుతోంది. కరెక్ట్‌ టెక్నిక్స్‌ను నేర్చుకోవాలని ప్రయత్నించానని తెలిపింది. ఇందులో భాగంగా సెట్స్‌పై రెండు సార్లు గాయపడ్డానని చెప్పింది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే ఆ మాదిరి కష్టం తప్పదు కదా అన్నది శ్రద్ధా చెబుతున్న మాట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఎక్స్‌పర్ట్‌ అయిన టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి చెయ్యడం.. నిజంగా మైండ్‌ బ్లోయింగ్‌ ఎక్స్‌పీరియన్స్ అని చెబుతోంది. ప్రేమలో పడ్డవాళ్లు రెబల్‌ కావాలని చెప్పే ‘బాఘి’ సినిమాలో యాక్షన్ సీన్లకు కొదవేలేదని తెలిపింది. ట్రైలర్‌ విడుదలైనప్పట్నించీ అందులో ఆమె యాక్టింగ్ కి పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.సాజిద్‌ నదియడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సబ్బీర్‌ఖాన దర్శకుడు. ఏప్రిల్‌ 29న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →