Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Shruti Haasan and Kamal Haasan’s partner have an ugly fight on the sets..?

By   /  August 17, 2016  /  Comments Off on Shruti Haasan and Kamal Haasan’s partner have an ugly fight on the sets..?

    Print       Email

sruthi haasanశృతి హాసన్ – గౌతమి మధ్య వాగ్వాదం..?

 

InCorpTaxAct
Suvidha

 
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో శృతి హాసన్ టాప్ రేంజ్ కి వెళ్ళిపోయింది. తర్వాత మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ .. తండ్రి కమల్ హాసన్ తో కలిసి ‘శభాష్ నాయుడు’ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో కీ రోల్ లో శృతి కనిపించనుంది. ఇక అలనాటి అందాల తార గౌతమి ఈ సినిమాకి స్టైలిస్ట్ గా పనిచేస్తున్నారు.

స్టైలింగ్ విషయంలో గౌతమికి మంచి నాలెడ్జ్ ఉంది. దీంతో శృతికి తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. రీసెంట్ గా శృతి హాసన్ – గౌతమి మధ్య దుస్తుల విషయంలో వాగ్వాదం విభేదాలు వచ్చాయని కోలీవుడ్, టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించిన శృతి హాసన్.. తన ప్రతినిధి ద్వారా ఓ ప్రకటన విడుదల చేయించింది.

”శభాష్‌ నాయుడు’లో లాస్‌ ఏంజెలిస్‌లో పుట్టి పెరిగిన ఓ అమ్మాయిగా శ్రుతిహాసన్‌ కనిపించనుంది. ఎవర్నీ లెక్క చేయని తత్వం ఉండే అమ్మాయిగా పాత్రలో కనిపించనుంది.పాత్రకి తగ్గట్లుగానే శృతి తన లుక్స్ ని మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత్రకు అనుగుణంగా ఉండేలా కొన్ని దుస్తులను గౌతమి కొనుగోలు చేశారు. అయితే అవి సరిపోవని ఇంకా కావాలని మూవీ యూనిట్ చెప్పడంతో గౌతమి అంగీకరించారు. మరిన్ని అవసరమైన దుస్తులు తీసుకువచ్చారు. అంతే తప్ప.. ఇరువురి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు, విభేదాలు తలెత్తలేదు’ అంటూ శృతి ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →