అన్ని జిల్లాల్లో క్రీడా ప్రాంగణాలు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది క్రీడాకారులున్నారని వారికి, ఆసక్తి చూపే పిల్లలకు ప్రభుత్వం తరపున తగిన ప్రోత్సాహం ఇస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తామన్నారు. పీవీ సింధు లాంటి మరింత మంది క్రీడాకా రులను తయారు చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొం దించనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ పీవీ సింధును హృదయపూర్వకంగా అభినందించి సన్మానించారు. రూ.5కోట్ట చెక్కును అందించారు. కోచ్ గోపీని కూడా అబినందించి రూ.కోటి చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో క్రీడాకారులుగా ఎవరికి వారు ఎదిగి పతకాలు సాధిస్తున్నారు తప్ప ప్రభుత్వ పరంగా సరైన ప్రోత్సాహం లభించడం లేదనే భావన ఉందన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఒలింపిక్స్ పతకాలు సాధించడమే లక్ష్యంగా అందరూ కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రముఖ క్రీడాకారులు, అధికారులు, కోచ్‌లు, క్రీడా సంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి క్రీడా విధానాన్ని ఖరారు చేయాలన్నారు. వచ్చే బడ్జెట్ నాటికి విధానం రూపొందించి, నిధులు కేటాయిస్తామని చెప్పారు. గతంలో అన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో ఆటలు ఆడేవారని, కానీ ఇప్పుడు పరీక్షల్లో మార్కులు సంపాదించడమే లక్ష్యంగా మారి క్రీడ లను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రభుత్వ పరంగా కూడా మరింత చొరవ అవసరం అని సీఎం చెప్పారు. పీవీ సింధు దేశం గర్వపడే విధంగా ప్రతిభ ప్రదర్శించి పతకం సాధించడం అభినందనీయమని సీఎం అన్నారు. కోచ్ గోపీ చంద్ కూడా తన అకాడమీ ద్వారా ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారన్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.