Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Sindhu gets warm welcome

By   /  August 23, 2016  /  Comments Off on Sindhu gets warm welcome

    Print       Email

sindhuవెండికొండ.. సింధుకు ఘ‌న‌స్వాగ‌తం

 

InCorpTaxAct
Suvidha

 

 

రియో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ సింగిల్స్ లో రజత పతకాన్ని సొంతం చేసుకొని సంచలనం సృష్టించిన సింధు.. నిన్న హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది. ఉదయం 9 గంటల‌కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వెండికొండ‌.. సింధుకు న‌గ‌ర ప్ర‌జ‌లు, ప‌లు పార్టీల‌నాయ‌కులు, అభిమానులు పూల‌బొకేలు ఇచ్చి అభినంద‌న‌లు తెలిపారు.  సింధు రాక సంద‌ర్భంగా తెలంగాణ స‌ర్కార్ ఘ‌నంగా ఏర్పాట్ల‌ను చేసింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు గచ్చిబౌలి స్టేడియం వరకూ సాగింసాగుతోంది. ఆమెను చూసేందుకు.. వెల్ కం చెప్పేందుకు రోడ్డుకు ఇరువైపులా వేలాది మంది వెయిట్ చేశారు. మరోవైపు గచ్చిబౌలి స్టేడియంలో సింధును అభినందనలు తెలిపేందుకు పెద్ద ఎత్తున సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తార‌క‌రామారావు ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, ఆమె కోచ్ గోపీచంద్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన సింధు సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.

ఒలింపిక్స్‌లో సింధు, సాక్షి మాలిక్ దేశ గౌరవాన్ని నిలబెట్టారని ప్రశంసించారు. దేశం గర్వించే పుత్రికగా సింధు నిలిచిందని కొనియాడారు. ఎన్నో త్యాగాల తర్వాతనే ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. భారత్ నుంచి సింధు లాంటి మరెంతో మంది ఛాంపియన్లు రావాలన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ అనేక కార్యక్రమాలు, పాలసీలతో దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచింది. దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో సింధు మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మీరంతా ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. మీకందరికీ ధన్యవాదాలు. మీ మద్దతు, ఆశీస్సుల వల్ల నేను ఇవాళ ఇక్కడ ఉన్నానని చెప్పొచ్చు. ప్రత్యేకంగా మా గురువు గోపీచంద్‌కు, నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, మద్దతుతో పాటు గోపీచంద్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నాను. మున్ముందు మరెన్నో పతకాలు సాధిస్తానన్న నమ్మకం ఉంది’ అని సింధు పేర్కొన‌డం విశేషం.

sindhu1

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →