Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Sir Arthur Cotton, a humane British engineer revered by Indians

By   /  July 24, 2016  /  No Comments

    Print       Email

13718643_10154434480879697_3721783357464028145_n“మహా పుణ్య జలప్రదాత” సర్ ఆర్థర్ కాటన్
గోదావరి జలాలను పొలాలకు తరలించిన భగీరధుడు
నిస్వార్థ ప్రజా సంక్షేమ నిరతుడు

ఉభయగోదావరిజిల్లాలు-కాటన్

InCorpTaxAct
Suvidha

పవిత్ర జీవనది కి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్ది వరకు అతివృష్టి వలన, వరదముంపుకు లోనగుచు, అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది. 1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు. అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, సంకల్పం చెప్పునప్పుడు

కాటన్ దొర మహాశయునికి సంస్మరణీయ నిత్య గోదావరి జలాలతో అర్చన అభిషేకాలు – వేదపండితులు కూడా తమ నిత్య దేవతార్చనాలో భాగంగా, ప్రప్రథమంగా కాటన్ దొరకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకునే, తమ పూజా పునస్కారాలు పూర్తిచేసుకునేవారట.

నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం

(మాకు గోదావరి నదీ స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరధుడు, ఆంగ్ల దేశీయుడైన కాటన్ దొరగారిని ప్రతినిత్యం స్మరించి తరిస్తున్నాము. అని ఈ శ్లోకానికి తాత్పర్యం)

అని పఠించేవారు. అంతటి గౌరవాన్నిపొందాడు. ఉభయగోదావరి జిల్లాల లోని చాలా గ్రామాలలో ఇతరదేశ నాయకుల విగ్రహాలున్నా, లేకపోయినా తప్పనిసరిగా కన్పించే విగ్రహం గుర్రముమీద స్వారీచేస్తున్న కాటన్ దొర, లేదా బస్ట్‍సైజు కాటన్ విగ్రహం. అంతగా ఈ ప్రాంతపు ప్రజల గుండెలలో 150 సంవత్సరాలు గడిచినా నిలచి ఉన్న చిరంజీవి కాటన్ దొర. ఆతరువాత ఈ మధ్య కాలములో ఈ ఆనకట్ట ను మరింత గా అభివృద్ధి పరచి, ధృడంగా చేయబడి కట్టబడినది.

కాటన్ జీవితం-మైలురాళ్ళు

సంవత్సరము కాటన్ జీవితంలోని మైలురాళ్లు
1826-29 పాంబన్ జలసంధి అభివృద్ధి
1836-39 తాంజోర్ జిల్లాలోని కావేరి డెల్టా అభివృద్ధి, కోలెరోన్ ఆనకట్ట నిర్మాణము
1836 మద్రాసు హర్బరు పథకము అమలు
1837 మద్రాసు నుండి రెడ్‍హిల్సు వరకు రైలుమార్గం నిర్మాణపనులపై పర్యవేక్షణ
1838-40 విశాఖ నౌకాశ్రయ నిర్మాణ ప్రాజెక్టు పని. దేశంలోనే ప్రముఖ రేవుగా నేడు ఆవిర్భవించినది
1843-52 ధవళేశ్వరం-విజ్జేశ్వరం మధ్య గోదావరి పై ఆనకట్ట నిర్మాణము
1852 గన్నవరం అక్విడక్టు నిర్మాణం
1856 కృష్ణానదిపై ఆనకట్ట నిర్మాణంపై నివేదిక సమర్పణ
1859 ఒడిసా ప్రభుత్వానికి నీటిపారుదల పై నివేదిక తయారుచేసి సమర్పించాడు
1878 తుంగభద్ర కాలువల నిర్మాణము. ఉత్తరభారతంలోనినదులను దక్షిణభారత నదులతో అనుసంధానంపై నివేదిక

సర్ ఆర్థర్ కాటన్
జననం మే 15, 1803
మరణం జూలై 24, 1899
డార్కింగ్, సర్రీ, యునైటెడ్ కింగ్ డమ్
ఇతర పేర్లు కాటన్ దొర
తండ్రి హెన్రీ కాల్వెలీ కాటన్

కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి మరియు నీటిపారుదల ఇంజనీరు.

కాటన్ తన జీవితాన్ని బ్రిటిషు భారత సామ్రాజ్యములో నీటిపారుదల మరియు నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశాడు. ఈయన జీవిత లక్ష్యం మరణించేసరికి పాక్షికముగానే మిగిలిపోయినది. కాని ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన చేసిన కృషికి ఈనాటికీ గౌరవింపబడుతున్నారు. 1819లో మద్రాసు ఇంజనీరుల దళములో చేరి మొదటి బర్మా యుద్ధములో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. ఈయన ధర్మోపదేశకుడు మరియు బ్రిటిష్ ధర్మోపదేశకురాలుఎలిజిబెత్ కాటన్ యొక్క తండ్రి.

మహాజలప్రదాత సర్ ఆర్థర్ కాటన్ గారి వర్థంతి సందర్భంగా “తెలుగురధం& కొంపెల్లశర్మ” శత సహస్ర ప్రణామాలని, జలతర్పణతోసమర్పిస్తూ, ప్రణమిల్లుతున్నాం.

 

Author:

కొంపెల్ల శర్మ, తెలుగురధం. Kompella Sarma.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →