వాళ్ల ప్రేమ ప్రపంచమంత
ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు… ప్రేమకు ధనిక.. పేద.. పొడువు.. పొట్టి ఇవేనీ కనిపించవు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ గుడ్డిది. ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇద్దరు పొట్టివాళ్లు వాళ్ల ప్రేమను ప్రపంచానికి చాటారు. వివరాల్లోకి వెళ్తితే.. బ్రెజిల్‌కు చెందిన ఆ ప్రేమికుడి పేరు పౌలో (84.8)అంగుళాలు. ప్రేయసి పేరు కట్యూసియా (85.2)అంగుళాలు ఎత్తు. వీరిద్దరికీ పదేళ్ల కిత్రం ఎమ్ఎస్ఎన్ అనే మెసెంజర్ ద్వారా పరిచయమైంది. కట్యూసియా తొలి చూపులోనే పౌలోను ఆకర్షించింది. అయితే కట్యూసియా మాత్రం పౌలోను పెద్దగా పట్టించుకోలేదు. అయితే పౌలో భగీరథ ప్రయత్నం చేసి కట్యూసియాను దక్కించుకున్నాడు. కట్యూసియాను తొలిసారి కలిసేందుకు దాదాపు 800కిలోమీటర్లు ప్రయాణించాడు. అయినా పౌలో మీద కట్యూసియాకు సదభిప్రాయం ఏర్పడలేదు. అతను ఎంతగా తన లవ్ గురించి చెప్పినా ఆమె కన్విన్స్ కాలేదు. అలా 18 నెలల అనంతరం పౌలో కమిట్మెంట్ను మెచ్చి అతనికి ఎస్ చెప్పింది. ఇప్పటికి వారికి వివాహమై నాలుగేళ్లు పూర్తయింది. వారు వారి ఎత్తుకు తగ్గటే వారింట్లో కుర్చీలను,సోఫాలను,మంచాలను సమకూర్చుకున్నారు. అంతేకాదు… కారు కూడా వారి ఎత్తుకు తగినంతగానే ఉంటుంది. పౌలో ఓ కంపెనీకి లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తుండగా, కట్యూసియాకు సొంతంగా ఓ బ్యూటీ పార్లర్ ఉంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.