Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Somu veerraju Targets AP CM Chandrababu Naidu

By   /  February 21, 2018  /  Comments Off on Somu veerraju Targets AP CM Chandrababu Naidu

    Print       Email

బీజేపీపై అన్యాయంగా నిందవేస్తున్నారు : సోము వీర్రాజు

 

InCorpTaxAct
Suvidha

 

ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా మిత్ర పక్షాలైన బీజేపీ, టీడీపీల మద్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తమకు ఇవ్వాల్సిన నిధుల్లో మోసం చేసిందని ఓవైపు టీడీపీ చెబుతోంటే.. మేం లెక్క ప్రకారం ఇస్తున్నా టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తుందంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మిత్రపక్షం టీడీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అనవసర రాద్దాంతాలు చేస్తూ.. బీజేపీని రోడ్డుపైకి ఈడుస్తుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడును మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ నేత సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఏపీకి రావాల్సిన నిధులు ఇదివరకే 85 శాతం వరకు వచ్చాయన్నారు. మిగిలిన నిధులు ఏపీకి ఇవ్వడానికి 2022 వరకు సమయం ఉందన్నారు. మీడియా పక్షపాతాన్ని వదిలి, వాస్తవాలు చూపించాలని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబును ప్రశ్నించని మీడియా, కేవలం బీజేపీ నేతల్ని మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తుందో తనకు అర్థం కావడం ఆవేదన వ్యక్తం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →