త్వరలో ఫ్యాషన్ రంగంలోకి వెళ్తా : సోనాక్షి సిన్హా
బాలీవుడ్లో అడుగుపెట్టిన సోనాక్షి సిన్హా.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొంది.అంతేకాదు మంచి నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు సినిమాల్లో.. మరోవైపు ఫ్యాషన్ కార్యాక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ బిజీ బిజీగా మారిపోయింది. అయితే.. సినిమాల కంటే తనకి ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే ఎక్కువ ఆశక్తి అని చెబుతోంది. ఎప్పటికైనా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనే రాణిస్తానని చెబుతోంది.
ప్రస్తుతం ‘ఫోర్స్-2’.. ‘అఖీరా’ మూవీల్లో నటిస్తోంది.అయితే వీలు దొరికినప్పుడల్లా ఫ్యాషన్ షోల్లో ర్యాంప్ వాక్ చేస్తూ అందరిని అలరిస్తోంది. నటిగా ఎంత పేరు వచ్చినా.. తన మనసు ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే ఉంటుందని తెలిపింది. ‘నా విధి ఎన్నో రకాలుగా రాసిపెట్టి ఉంది. అందులో నటించాలని ఉంది కాబట్టి నటిస్తున్నాను. కానీ.. ఫ్యాషన్ డిజైనింగ్‌పైనే నా ఆలోచనలు ఉండేవి.చదువుకునే సమయంలో లాక్మే ఫ్యాషన్ వీక్ షోలకు వెళ్లేదాన్ని. అయితే అక్కడ కేవలం వాలంటీర్‌గా పని చేసేదాన్ని. ఇప్పుడు అలాంటి షోలోనే ర్యాంప్‌పై నడుస్తున్నా. అందుకే నాకు నచ్చిన దారిలోనే వెళ్తున్నానని భావిస్తున్నా. నటన అనేది నా వృత్తి. ఫ్యాషన్‌కూ నటనకు సంబంధం ఉంది. అందుకే భవిష్యత్తులో తప్పకుండా ఫ్యాషన్ రంగంలోకి వెళ్తానని సోనాక్షి చెబుతోంది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.