Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Sonia gets warm welcome in Varanasi road show…

By   /  August 3, 2016  /  Comments Off on Sonia gets warm welcome in Varanasi road show…

    Print       Email

03sonia1మోడీ ఇలాకాలో సోనియాకు ఘ‌న స్వాగ‌తం

 

InCorpTaxAct
Suvidha

 

 

2014 ఎన్నిక‌లకు ముందు దేశం మొత్తం ఎటు చూసినా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నామ‌స్మ‌ర‌ణే. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేవారు. మీటింగ్‌ల‌కు ల‌క్ష‌ల మంది త‌ర‌లివ‌చ్చేవారు. ముఖ్యంగా తాను ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో అయితే ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అలాంటి ఇప్పుడు మోడీకి అక్క‌డ ఎదురు గాలి వీస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. మోడీని టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి  ప్రచారం ప్రారంభించేశారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ఆమె రోడ్డు షో నిర్వహించారు. సోనియా భారీ కాన్వాయ్, భద్రత మధ్య నగరంలో దాదాపు 6.5 కిలోమీటర్ల మేర రోడ్డు షోలో పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు. ఈ భారీ ర్యాలీకి వేలాదిమంది తరలిరావడం కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహాన్ని నింపింది. మోదీ కోటలో కాంగ్రెస్ పార్టీ సత్తా చూపాలని ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించారు.

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్, యూపీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ తదితర నేతలు రోడ్డు షోలో పాల్గొన్నారు. అయితే అనారోగ్యం కారణంగా ఆమె రోడ్డు షోను మధ్యలోనే ఆపివేసి..ఢిల్లీ వెళ్ళిపోయారు. గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు లోక్ సభ సీట్లు గెలవగా, బీజేపీ 80 సీట్లకుగాను 71 గెలుచుకుంది. ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో కాంగ్రెస్‑కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. నానా తంటాలు పడి చివరకు యూపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలా దీక్షిత్ ను ప్రకటించారు. తొలుత రాహుల్..ప్రియాంక పేర్లు ప్రచారంలోకి వచ్చినా అందుకు వారిద్దరూ తిరస్కరించినట్లు సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →