Loading...
You are here:  Home  >  World News  >  Asia News  >  Current Article

South Korea warns USA..

By   /  March 15, 2017  /  Comments Off on South Korea warns USA..

    Print       Email

kim-jong-un-north-koreaఅమెరికాపై దాడులకు చేస్తాం.. ఉత్తర కొరియా హెచ్చరికలు..

ఉత్తర కొరియా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఖండాంతర క్షిపణులను ప్రయోగిస్తూ దడ పుట్టిస్తోంది. తాజాగా దేశం అగ్రరాజ్యం అమెరికాకు హెచ్చరికలు చేసింది. విచక్షణ లేకుండా అమెరికాపై దాడులకు తెగబడతామని తేల్చి చెప్పింది. అమెరికా వాహన నౌక దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా దాడులు చేస్తామని ప్రకటించింది. యూఎస్ కు చెందిన కార్ల్ విజన్ అనే విమాన వాహన నౌక దక్షిణ కొరియా చేరుకుంది. దీంతో ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. ఈ రెండు దేశాల చర్యలు తమ సార్వ భౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నాయని పేర్కొంది. తమ గౌరవం ఏ మాత్రం చెడినా ఊరుకోబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ దేశ అధికారిక న్యూస్ ఛానల్ కేసీఎన్ ఏ తెలిపింది. అమెరికాపై నేల నుంచి, సముద్ర గర్భం నుంచి దాడులకు తెగబడతామని స్పష్టం చేసింది.

InCorpTaxAct
Suvidha

అయితే కార్ల్ విజన్ కేవలం డ్రిల్ చేపట్టేందుకే వచ్చిందని అమెరికా నేవీ ప్రకటించింది. ఇది సాధారణ విధుల్లో భాగమేనని తేల్చి చెప్పింది. దక్షిణ కొరియా తమ మిత్రదేశమని తెలిపింది. ఇక అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్ సన్ వచ్చే శుక్రవారం దక్షిణ కొరియాకు వెళ్లనున్నారు. ఈ డ్రిల్ ను వ్యతిరేకిస్తూ ఒకేసారి నాలుగు ఖండాంతర క్షిపణులను దక్షిణ కొరియా ప్రయోగించిన విషయం తెలిసిందే. వీటిలో జపాన్ ఆర్దిక సముద్ర జలాల్లో పడిన విషయం తెలిసిందే.ఈ విషయాన్ని జపాన్ కూడా ప్రకటించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →