Loading...
You are here:  Home  >  Deccan Abroad  >  Current Article

South Queen’s director Revathy..!

By   /  February 2, 2016  /  Comments Off on South Queen’s director Revathy..!

    Print       Email

రేవతి డైరెక్షన్ లో ‘క్వీన్’ మూవీ రీమేక్..!

 

InCorpTaxAct
Suvidha

బాలీవుడ్ లో వచ్చిన ‘క్వీన్’ మూవీ గుర్తుందా..? ఆ మూవీ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న విషయం కూడా అందరికి తెలిసే ఉంటుంది.అలాగే విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది.అంతేకాదు.. ఈ మూవీతో కంగనా రనౌత్ కు ఏకంగా స్టార్ స్టేటస్ వచ్చేసింది.ఇంతకీ ఈ మూవీ గురించి ఇప్పుడు ఎందుకు అనేగా మీ డౌట్..? అక్కడికే వస్తున్నాం..!

queen poster

ఈ చిత్రాన్ని తెలుగు-తమిళ బాషల్లో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని సీనియర్ నటీమణి రేవతి డైరెక్ట్ చేయబోతున్నారు.’మిత్ర్ మై ఫ్రెండ్’.. ‘ఫిర్ మిలేంగే’ వంటి చిత్రాలకు రేవతి డైరెక్టర్ గా పనిచేశారు. ఇప్పుడు ఈ ‘క్వీన్’ మూవీని రెండు భాషల్లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. మరో సీనియర్ నటి సుహాసిని ‘క్వీన్’ రీమేక్ కి రెండు బాషల్లో మాటలు అందిస్తున్నారు.

Revathi Photo

ఇప్పటికే ఈ రీమేక్ కి సంబంధించి మొదటి అర్ధభాగానికి సంబంధించిన వర్క్ ని సుహాసిని కంప్లీట్ చేసేశారని టాక్. త్వరలో సెకెండ్ పార్ట్ వర్క్ కూడా పూర్తి చేస్తారని సమాచారం. అంతా సవ్యంగా జరిగితే వచ్చే అక్టోబర్ లో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్ళాలని రేవతి ప్లాన్ చేస్తున్నారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.

పెళ్ళికి ముందు రోజున వివాహం ఆగిపోతే.. ముందుగా హనీమూన్ కోసం బుక్ చేసుకున్న టిక్కెట్లపై టూర్ వెళ్ళిన అమ్మాయి కథే క్వీన్ స్టోరీ. పారిస్ వెళ్ళిన అమ్మాయికి అక్కడ ఎదురైన పరిస్థితులు ఏమిటి.. కొత్త పరిచయాలు.. తర్వాత పెళ్ళి కాదనుకున్న యువకుడు సారీ చెప్పడం.. ఆమె తిరస్కరించడం.. ఇతివృత్తంగా సినిమా ఉంటుంది. ముఖ్యంగా ఫీమేల్ డామినేషన్ తో సాగే మూవీ కాబట్టి.. ఖచ్చితంగా హిట్ అవుతుందని సినీ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →