ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ డిస్మిస్
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గతంలోనే స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు వైసీపీ సభ్యులు పిటీషన్ ఇచ్చారు. వైసీపీ పిటీషన్ ఇచ్చే నాటికి భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, సి. ఆదినారా యణరెడ్డి, జలీల్ ఖాన్, తిరివీధి జయరాములు, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎం. మణిగాంధి, కలమట వెంకట రమణ మూర్తి, పాశం సునీల్‌కుమార్, జ్యోతుల నెహ్రూ, వేర్పుల సుబ్బారావు, రావు వెంకట సుజయ కృష్ణరంగా రావు, అత్తార్ చాంద్ బాషలు టీడీపీలో చేరారు. పార్టీ మారిన ఈ 13 మందిని అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ డిమాండ్ చేసింది. అయితే వైసీపీ ఇచ్చిన పిటీషన్‌పై నిన్న స్పీకర్ కోడెల స్పందిస్తూ సదరు పిటీషన్లు సరైన పార్మట్లలో లేఖ పోవడంలో వలన వాటిని డిస్మిస్ చేసినట్లు చెప్పారు. ప్రోటోకాల్ వివాదంతో రాజీనామా చేసిన కడప జిల్లా మైదుకూరు ఎంఎల్ఏ రఘురామిరెడ్డి రాజీనామా పత్రం ఇంకా తన వద్దకు రాలేదని స్పీ కర్ స్పష్టం చేశారు. గా స్పీకర్ పిటీషన్ తిరస్కరించిన విషయాన్ని గ్రహించిన వైసీపీ నిబంధనలకు అనుగుణంగా పిటీషన్లను రూపొందించి మళ్ళీ 13 మందిపై అనర్హత పిటీషన్లను దాఖలు చేసింది.
అయితే సరైన ఫార్మాట్లో ఇచ్చిన అనర్హత పిటీషన్‌పై ఎప్పుడు విచారణ చేస్తారన్న విషయంలో స్పష్టత లేదు. అలాగే, మిగిలిన ఏడు మంది ఎంఎల్ఏల విషయంలో కూడా వైసీపీ న్యాయ నిపుణులను సంప్రదించి నిబంధనలకు అనుగుణంగానే అనర్హత పిటీషన్‌ను స్పీకర్‌కు అందచేసింది. అంటే, మొత్తం 20 మంది ఎంఎల్ఏలను అనర్హులను చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ తాజాగా మరో పిటీషన్ దాఖలు చేయటం గమనార్హం. కాగా ఇదే విషయమై వైసీపీ దాఖలు చేసిన కేసుపై హైకోర్టులో కూడా వాదనలు మొదలవ్వాల్సి ఉంది. సుప్రింకోర్టులో వైసీపీ పిటీషన్ దాఖలు చేయగా సదరు పిటీషన్‌ను హై కోర్టునే విచారణ చేయాల్సిందిగా సుప్రింకోర్టు సూచించటం అందరికీ తెలిసిందే.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.