Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Special Status discussion brings tension between BJP&TDP relationship

By   /  July 31, 2016  /  Comments Off on Special Status discussion brings tension between BJP&TDP relationship

    Print       Email

babu-modiటీడీపీ, బీజేపీ మ‌ధ్య `ప్ర‌త్యేక` చిచ్చు

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో ఎప్పుడైతే చర్చ మొదలైందో అప్పటి నుండి మిత్రపక్షాలైన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల బంధం మధ్య చీలక మొదలైంది. మొదట్లో ఆ బిల్లును టీడీపీ, బీజేపీలు చాలా తేలిగ్గా తీసుకున్నా బిల్లుపై చర్చకు రాజ్యసభ వైస్‌ ఛైర్మన్ ఎప్పుడైతే తేదీ, సమయం ప్రకటించారో అప్పటి నుండే వేడి మొదలైంది. చాప‌కింద నీరులా కాంగ్రెస్ పార్టీ స‌భ్యుడు కేవీపీ జాతీయ స్ధాయిలోని రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టటం మొదలుపెట్టారు. అందుకు కాంగ్రెస్ పార్టీ కూడా శక్తివంచ‌న‌ లేకుండా సహకరించింది. దాంతో బిల్లుపై జాతీయ స్ధాయి పార్టీల్లో కూడా మద్దతు లభించింది.  దీంతో ముందు చాలా తేలిగ్గా తీసుకున్న బిల్లు చివరకు రెండు పార్టీల విషయంలో ఏకు మేకై కూర్చుంది. దాంతో ప్రజల దృష్టిలో దోషి కాకూడదన్న ఉద్దేశ్యంతోనే ఇపుడు రెండు పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వటం సాధ్యం కాదన్న విషయాన్ని కేంద్రప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. అయినా సరే కేవీపీ  ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టటం ద్వారా రాష్ట్రంలోని అన్నీ పార్టీలను ఇరుకునపెట్టాలనుకున్నారు. ఒకవేళ ఈ బిల్లుపై ఎటువంటి ఫలితమూ రాకున్నా ఈ స్ధాయిలో కేంద్రంలోను, రాష్ట్రంలోను అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేట్లు చేయటంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది. భవిష్యత్తులో కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటుమెంబర్ బిల్లే కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదుతుందేమో. ఎప్పుడైతే ప్రత్యేకహోదా అంశానికి రాజ్యసభలో పార్టీలకతీతంగా మద్దతు లభించిందో బీజేపీ కూడా కంగుతింది. బిల్లుపై చర్చ మొద లైన మొదటిరోజే విషయాన్ని గ్రహించిన చంద్రబాబునాయడు బిల్లుపై మద్దతు ఇస్తూ మాట్లాడమని తమ పార్టీ ఎంపిలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

తమతో మాటమాత్రం గానైనా చెప్ప‌కుండానే బిల్లుకు టీడీపీ మ‌ద్ధ‌తుఇవ్వ‌డాన్ని జీర్ణించుకోలేని బీజేపీజాతీయ నాయకత్వం టీడీపీ ఎంపిలపై రాజ్యసభలోనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సిఎం రమేష్, సుజనా చౌదరిలపై ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుటీడీపీ వర్గాలు తెలిపాయి. దాంతో అదే విషయాన్ని ఎంపీలు చంద్రబాబు దృష్టికి తెచ్చారు.  విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు పార్టీలోని సీనియర్ నేతలతో చర్చించారు. బిల్లుపై క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చర్చ, ప్రత్యేకహోదా అంశం ప్రజల మనోభావాల్లో నాటుకుపోయిన విషయాలను గ్రహించారు. ఇపుడు గనుక బిల్లుకు మద్దతుగా నిలవలేకపోతే రేపటిరోజున ప్రజల ముందు దోషులుగా నిలవాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు గ్రహించారు.

ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు తన ఎంపిలతో మాట్లాడుతూ రెండో రోజు మరికాస్త దూకుడుగా వెళ్ళాలంటూ సూచించారు. అయితే, ఆ దూకుడులో బిల్లుకు మద్దతు, ప్రత్యేకహోదా ఇస్తే రాష్ట్రానికి జరిగే మేలు గురించి మాత్రమే చెప్పాలని ఆదేశించారు. అదే విధంగా ఎంపిలు రాజ్యసభలో ప్రసంగించారు. దానికితోడు జాతీయ పార్టీలు కూడా మద్దతు పలకటంతో బీజేపీ ఒంటరిగా మిగిలిపో యింది. ఇదే అంశాన్ని టీడీపీ ఎంపిలతో బీజేపీ నేతలు ఢిల్లీలో ప్రస్తావించి నట్లు కూడా తెలిసింది. తమ అధినేత ఆదేశాల మేరకే తాము నడుచుకుం టున్న సంగతిని ఎంపిలు స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో చర్చ జరిగిన తర్వాత పలువురు టీడీపీ ఎంపిలు సభలో మాట్లాడిన కేంద్రమంత్రి వెంకయ్యనా యడును తప్పు పడుతూ పార్లమెంట్ వెలుపల మీడియా ముందే బాహాటంగా వ్యాఖ్యలు చేసారు.

దీంతో బీజేపీ నాయకత్వానికి మండిది. తమతో మిత్రపక్షంగా ఉంటూనే చివరి నిము షంలో కాంగ్రెస్ సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వటాన్ని బీజేపీ తప్పు పట్టింది. మూడో రోజు కూడా టీడీపీ ఎంపీలు అదే ఒరవడిని కొనసాగిస్తూనే చివరకు అరుణ్‌జైట్లీ ప్రసంగంపైన కూడా విరుచుకుపడటం మొదలు పెట్టారు. టీడీపీ ఎంపిల ఆరోపణలు, విమర్శలపై వెంటనే కమలం నేతలు ఎదురు దాడులు మొదలుపెట్టారు. దాంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగింద‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. మునుముందు టీడీపీ, బీజేపీ మ‌ధ్య ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకోబోతున్నాయో వేచి చూడ‌క త‌ప్ప‌దు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →