Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Special status is our right

By   /  March 6, 2018  /  Comments Off on Special status is our right

    Print       Email

ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* ఢిల్లీ వీధుల్లో మార్మోగిన నినాదం
* వైయ‌స్ఆర్‌సీపీ ధ‌ర్నాకు సీపీఎం, సీపీఐ సంఘాభావం
* క‌నిపించ‌ని టీడీపీ, బీజేపీ ఎంపీలు
* నాయ‌కుల అరెస్టు..విడుద‌ల‌
* వైయ‌స్ఆర్‌సీపీ ధ‌ర్నా విజ‌య‌వంతం
డెక్క‌న్ అబ్రాడ్‌: పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన ప్ర‌త్యేక హోదాను వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేస్తూ మార్చి 5న ఢిల్లీలోని సంస‌ద్ మార్గ్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ధ‌ర్నా చేప‌ట్టారు. ప్ర‌త్యేక హోదా మా హ‌క్కు అంటూ నిన‌దించారు. హోదా సాధించే వ‌ర‌కు విశ్ర‌మించ‌మంటూ గ‌ర్జించారు. ఏపీ నుంచి వ‌చ్చిన ప‌లు పార్టీల నేత‌లు “ప్ర‌త్యేక హోదా భిక్ష కాదు.. హోదా మా హ‌క్కు“ అని, “హోదా వ‌స్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని“ అనే ప్ల‌కార్డులు ప‌ట్టుకుని ధ‌ర్నాల పాల్గొన్నారు. ఈ ధ‌ర్నాకు సీపీఎం, సీపీఐ మ‌ద్‌ధతు తెల‌ప‌గా.. బీజేపీ, టీడీపీ ఎంపీలు క‌నిపించ‌లేదు. ధర్నా అనంతరం హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు ర్యాలీగా పార్లమెంటుకు బయలు దేరిన వైసీపీ నేతలను ఢిల్లీ పోలీసులు అడ్డుకొని.. బలవంతంగా అరెస్టు చేసి పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీంతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ ధర్నా, మోడీ, చంద్రబాబులపై కాంగ్రెస్‌ ఫిర్యాదు, పార్లమెంట్‌లో ఏపీ ఎంపిల ఆందోళన, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో టీడీపీ, బీజేపీ నేతలు భేటీ, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి, విద్యార్థి జేఏసీ నేతలు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా నివాసం వద్ద ధర్నా, ఆందోళన చేస్తున్న పలువురి అరెస్ట్‌ వంటి వరుస పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ధ‌ర్నా సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇవ్వకుంటే నెల 21న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, అయినా, ప్రభుత్వం స్పందించకుంటే ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని డిమాండ్‌ చేసిన పవన్‌ కళ్యాణ్‌, ఇప్పుడు అవిశ్వాసం వల్ల ఉపయోగం లేదంటున్నారని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగంలో ప్రత్యేక హోదాను చేర్చడం సంతోషకరమని వైసీపీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా మన హక్కని, హోదాను సాధించే పోరాటంలో అందరూ కలిసి రావాలని సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మధు పిలుపు నిచ్చారు. అందరూ కలిసి పోరాడితే..రాష్ట్రానికి ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని అన్నారు. ఏపికి ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకష్ణ వ్యాఖ్యానించారు. ఇక‌పోతే ధ‌ర్నాలో టీడీపీ-బీజేపీ ఎంపీలు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA donated Rs 20 Lakhs to Telugu States

Read More →