Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0005.”పు త్రోత్సాహం..!”

By   /  July 7, 2016  /  No Comments

    Print       Email

images”నాన్నా ఎందుకంత కోపం,విసుగు,చిరాకు..ఇంకా ఇంకా అలాటివన్నీ ప్రతిదానికీను..”

 

InCorpTaxAct
Suvidha
అలా అడుగుతున్న పదిహేనేళ్ళ కొడుకును ఎగాదిగా చూస్తున్నాడు 42 సంవత్సరాల వయసు గల తండ్రి..
”అన్నీ నువ్వు అనుకున్నట్లు జరగడం లేదని..ఎవరూ నీ మాట వినడంలేదని బాధపడటం వల్లే అదుగో అలా అవన్నీ అలా అలా మేరుపర్వతాల్లా పెరిగి కనిపిస్తాయి తెల్సా..!”
అని తన కన్నకొడుకే చెబుతుంటే ఓ ప్రక్క ఆనందంగా ఉన్నా మరోవైపు తండెరికం(తండ్రి తనం)
అనే భేషజం వెక్కిరిస్తుంటే..తట్టుకోలేక..
”ఊర్కోరా..ఇంకా ఏం నేర్చుకోవాల్రా..?! ఎన్నాళ్ళు నేర్చుకోవాల్రా..?! నువ్వూ చెప్పొచ్చే వాడివయ్యావా..ఇంతకన్నా కాస్త నీ చెప్పుచ్చుకు కొడితే..బావుంటుంది కదరా కన్నా..!”
బాధగా అన్నాడు తండ్రి.
”నాన్నా..అలా బాధ పడకండి..ఊర్కోరా అన్నారుగా..కాస్త అదే చేయండి..చూడండి..’ఏం నేర్చుకావాల్రా”అన్నారే..ఆ ‘ఏలో ‘ ఏత్వం తీసి తో గా మార్చితే ‘ఎంతో’ అవుతుంది..ఇక ‘ఎన్నాళ్ళు’ లో..ఎ తీసి ‘ఉన్న’అని పెడితే ”ఉన్నన్నాళ్ళు’ అవుతుంది..మరి ఆఖరు శ్వాస వరకు ఎంతైనా నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నవాడే తన జీవితానికి అసలైన ‘లీడర్’ సరియైన నాయకుడు అవుతాడు అని తెలిసింది నాన్నా”అని..
స్థిరంగా చెబుతున్న కొడుకు గొంతులోని ఆ నాయకత్వ ప్రజ్ఞకు..ఆ చక్కని లక్షణానికి ముగ్ధుడయ్యాడు..ఆ తండ్రి.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →