”నిన్ను నేను ప్రేమిస్తున్నాను..” చెప్పాడు అబ్బాయి..మెల్లగా దొర్లుతున్న గులకరాయిలా..
”ఈ శరీరాన్నా ..” అడిగింది అమ్మాయి జలపాతంలా..
పార్కులో బెంచీ సిగ్గుపడుతుండగా ఏవో పక్షులు కిలకిలమంటుండగా..ఆకాశం తియ్యగా మూల్గుతూ నల్లమబ్బుల్తో కురవడానికి సిద్ధంగా ఉండగా..
ఆ అమ్మాయి నవ్వింది చిన్న మెరుపుతీవలా..
”అయ్యో..నిన్ను నేను మనస్పూర్తిగా ఇష్టపడుతున్నాను..తెలుసా..”తన గొంతు తనకే పేలవంగా అనిపించిందతనికి ఎందుకో..!?
ఆమె అదోలా చూసింది..
”నిన్ను ఎన్నేళ్ళుగానో గమనిస్తున్నాను..నీ నిదానం..నీ ఆలోచనా విధానం..మరి నీ పనితీరు..నీ మాట..నీ నవ్వు..నీ రూపం..టోటల్ గా ..రియల్లీ..” అతను చ్బుతున్నాడేగాని అతనికే ఏదో వెలితిగా అన్పిస్తోంది..
”ఓహో..అది సరే..నేనూ నిన్ను ఇష్టపడాలిగా..నువ్వు నాకు బాగా నచ్చావ్..ఓ స్నేహితుడిగా..
మరి పెళ్ళి చేసుకుంటే ఆ స్నేహం అలా ఉండటం కష్టం కదా..!” అతని కళ్ళల్లోకే చూస్తూ అందామె.
అతను ప్రశ్నార్థకంగా ఆగిపోయాడు..
” ఇంకా కూడా పెళ్ళి తరువాత ఓ పొజెస్సివ్ నెస్ తో నా అనే సంకుచితత్వంతో..చాలా భయంకరంగా తయారౌతుంది పరిస్థితి..” మృదువుగా పలికిందామె.
”సరే ఐతే..నీ ఇష్టం..నువ్వు కోరుకున్న మాదిరే నేనుంటాను..
పెళ్ళంటూ చేసుకుంటే నీతోనే..ఓకే ”..
”అసలు నా సంగతి తెలియకుండా నువు చాలా తొందర పడుతున్నావ్ మిత్రమా..”అనేసి తన హాండ్ బాగ్ లోంచి వెడ్డింగ్ కార్డ్ తీసి అతని చేతిలో పెట్టి..
” రేపు సాయంత్రమే నా పెళ్ళి..నువు తప్పకుండా రావాలి..బై..”చెప్పి మెరుపులా మాయమైంది.
అతను కళ్ళు తెరిచాడు ” అమ్మయ్య..ఈ కల నిజం కాకూడదు..”
”నాది ప్రేమా’భ్రమా..”
అతని చేతిలో ఉన్న వెడ్డింగ్ కార్డ్ ఓ పచ్చి నిజం చెప్పింది..!
Author:
Madhav Rao Koruprolu
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.