Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Spiritual Story: ఆధ్యాత్మిక కథ..0036..”.అ సలు ప్రేయసి ..?!”/” (సశేషం) ‘ ‘

By   /  September 5, 2016  /  No Comments

    Print       Email

9456500ae56d053ff4e29e985506ca58అది ఓ మహానగరంలో ఓ సబ్ వే..రెండు వైపులా ఎందరో పూలు.. పండ్లు..కూరగాయలు ఇంకా ఏవో రకరకాల తాజా నిత్యావసరాలను అమ్ముతూ..వారివారి రోజువారి భత్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారక్కడ..!

ఓ ప్రక్కన సుమారు ఎనభై ఏళ్ల వృద్ధురాలు ఎంత  బక్కపలుచగా ఉందో.. ఏ మాత్రం గాలి కొంచెం గట్టిగా వీచినా పడిపోయేలా.ఆమె ఖాళీగా కూర్చుని తనలో తనే మాట్లాడుకోవటం గమనిస్తున్నాడు కొన్ని నెలలుగా..ఓ కుర్రాడు ‘అగ్నివేష్’.
ఆమె ఎవరినీ చేయిచాచి అడుక్కోవటం ఎన్నడూ చూడలేదతను.కనీశం ఒక బట్ట కూడా పరచలేదామె.అసలు ఏమైనా ఇస్తే తీసుకుంటుందో లేదో..ఇవ్వచ్చో లేదో..తెలియదు.అసలక్కడ ఆమె ఎందుకు కూర్చుందో అడగాలనిపించింది ‘అగ్నివేష్’కి..
అంతే వెంటనే ఆమె దగ్గరగా వెళ్లి..
” అమ్మా మీరిక్కడ ఎందుకు కూర్చున్నారు..”
ఆమె నుండి ఎలాంటి జవాబూ రాలేదు..అలా వరుసగా  ఓ వారం రోజులు ట్రై చేసాడతను.ఏమీ ప్రయోజనం కనపడలేదు.అతనిలో ఉత్సుకత పెరిగింది.
ఒక సాఫ్ట్ వేర్ కంపనీలో జస్ట్ జాయిన్ అయిన ‘అగ్నివేష్’ కి అసలు టైం సరిపోదు. ఉరుకులు పరుగుల జీవితం.రోజూ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడో లేదా  తిరిగి వచ్చేటప్పుడో..తప్పనిసరిగా  ఆమెను పలకరిస్తున్నాడు., షరా మామూలే..ఆమె ఏమీ చెప్పదు.
అతనికి ఉన్నట్టుండి ఫ్లాష్ లాగా లోపలనుండి ఏదో  జరిగింది.
తన జేబులోంచి ఒక టెన్ రూపీస్ తీసి ఆమె చేతికిస్తే ఎంచక్కా అందుకుని గాలిలోకి చూస్తూ తనలో తనే సన్నగా  నవ్వుకుంటోంది..!
” అమ్మా..! మీరు ఎవరు..ఎందుకు ఇక్కడ కూర్చున్నారు..!? ”
జవాబు లేదు..ఏంచేయాలో తోచలేదు ‘అగ్ని’కి..ప్రొద్దుటే ఆమె అసలు ఎప్పుడు వస్తుందో..మరి రాత్రి ఎప్పుడు వెళుతుందో..చాలా ఫ్రెష్ గా ఉంటుంది..కానీ ముఖంలో నవ్వు ఉండదు..ప్రశాంతంగా కనిపిస్తుంది.
మామూలుగా శని,ఆది వారాలు అగ్నికి సెలవు. శనివారం ప్రొద్దుటే వచ్చిఆమె మాట్లాడేదాకా తీరికగా కూర్చోవాలనుకున్నాడు..వచ్చేసాడు ఉదయం ఆరు గంటలకే.. యధాప్రకారం తనదైన పక్కీలో పలకరించాడు.మళ్ళీ మామూలే. ఈసారి ఒక వంద నోటు తీసిచ్చాడు.అది మాత్రం టక్కున అందుకుని మళ్ళీ తన ధ్యాసలో తానుందామె.ఆమె సంగతేంటో ఈరోజు ఖచ్చితంగా తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కొద్దిసేపు కామ్ గా ఉంటుంది మళ్ళీ కొద్దిసేపు తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది.చేతులు రెండు కట్టుకుని ఆమెనే గమనిస్తున్నాడు ‘అగ్ని’.వచ్చేపోయే వారంతా అతనిని వింతగా చూస్తూ వెళుతున్నా అతనికేమీ పట్టింపు లేదు.ఒక ఆరు గంటలు గడిచింది.పరిస్థితిలో ఏమీ మార్పులేదు.ఆకలి వేస్తోంది అగ్నికి.ఆమె సంగతేంటో..అసలింకెవరూ ఆమె వద్దకు రాలేదు.జస్ట్ చూస్తూ వెళ్ళిపోతున్నారు.’అగ్ని’కి దాహంగా ఉంది.ఏదో లోపల ఆరాటంగా అనిపించింది.మరో మూడు గంటలు గడిచింది.
” అమ్మా మీకు ఆకలి దప్పిక ఏమీ ఉండవా..!? ”
ఆమె ఏమీ జవాబు ఇవ్వలేదు.అసలు విన్నట్లుగా కూడా అనిపించలేదు.ఆమె ఠక్కున లేచింది..చాలా వేగంగా మెట్లు ఎక్కుతోంది.అనుసరించాడు ‘అగ్ని’.ఒక రెండు కిలోమీటర్లు సుమారుగా నడిచింది.”అచలాశ్రయం” అని వ్రాసి ఉన్న ఆశ్రమంలోకి ప్రవేశించింది.
అది కదలలేని వృద్ధుల కోసం ఉద్దేశించిన ఆశ్రమం.అక్కడ ఎంతమంది వృద్దులు ఉన్నారో..ఆమె మాత్రం అందరినీ చూస్తూ కదులుతోంది చాలా వేగంగా.ఆమెనే అనుసరిస్తున్న ‘అగ్నివేష్’లో మరి ఆకలి దప్పికలకు చెందిన అగ్ని జాడ లేదు.అతనికి ఆ ధ్యాసే లేదు.
అదంతా చూస్తుంటే ‘అగ్ని’కి ఓ కలలోలా ఉంది.ఒకసారి తనను తానే గిల్లి చూసుకున్నాడు సినిమాలోలానే.అంతా నిజమే.అదే క్షణంలో ఆమె ‘అగ్ని’చేయి పట్టుకుని ఓ చెట్టుకింద బెంచీపై కూర్చోబెట్టింది.ఆమె మాట్లాడటం మొదలు పెట్టింది.కాదు ఓ కథ చెప్పడం జరిగింది.కొంతసేపటికి అదంతా తనకు పరిచయం ఉన్నఒక జరిగిన..జరుగుతున్నకథలా తోచింది.మళ్ళీ కాసేపు కాదనిపించింది..మధ్యలోనే ఆమెను..
” ఇంతకీ ఈ కథ ఏమిటి మీరెవరూ..ఇదంతా ఎందుకిలా జరిగింది. .?! ”అడుగుతుంటే ఆమె నవ్వి..
” నీ కోసం ఇరవై ఏళ్లుగా ఎదురు చూస్తున్నా బాబూ..! నీ పేరు అగ్ని కదూ..అదే ‘అగ్నివేష్’ కదూ..నువ్వు నాకోసం వస్తావని ఆ రోజే తెలుసు నాన్నా..మీ నాన్నకు అమ్మను నాన్నా..మరి” అని ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆమె తలను గట్టిగా తన గుండెలకు హత్తుకుని  ధారాపాతంయ్యాడు.మరు నిముషంలో ఆమె ముఖంలోకి కొంచెం సూటిగా చూసాడు.తనతండ్రి ఒక రోజు రాత్రి తన పర్స్ తీసి ఒక అందమైన అమ్మాయి ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి గుర్తొచ్చింది లీలగా
”మళ్ళీ ఆ ఫోటో చూసుకు ఏడుస్తున్నారా..కాస్త తిని వెళ్ళండి ఆ ఎడవడానికి ఓపికొస్తుంది అన్న తన తల్లి మాటలు గుర్తొచ్చాయి అప్పుడు తనకు పదేళ్ళు.మళ్ళీ తనకు తండ్రి ఎప్పుడూ అలా కంటపడలేదు ” ఓ అచ్చు ఆ అమ్మాయి లాగే ఉంది ఈ నాన్నమ్మ.నాన్నగారి అసలు ప్రేయసి ఈవిడేనా..మరి ఇలాంటి ప్రేయసీమణులు..నాన్నగారి లాంటి ప్రియులు ఈ కలియుగం ఉన్నన్నాళ్ళు ఉండాల్సిందేనా..?!”
‘అగ్నివేష్’లోని అసలైన అగ్ని రగుల్కుంది.మరి కథ మారింది.(సశేషం..)
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →