Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0033 “పండుగ..!”

By   /  August 25, 2016  /  No Comments

    Print       Email

floating-diwali-flowers ” అమ్మా పండుగ అంటే ఏమిటి..?! ”  పదేళ్ళ ‘అద్వితీయ’ అడిగాడు తల్లి ‘ప్రథమ’ను.

” ఒరే కన్నా..ఎప్పుడూ పండుగలు చేసుకోవటమే కాని అంటే ఏమిటనే ఆలోచనే రాలేదురా..అవును పండుగ ఒక రోజే కాకపొతే ఓ గుర్తుగా జరుపుకుంటాం..ఇప్పుడు పుట్టినరోజు పండుగ బర్త్ డే లాగే..! ”
” అమ్మా..నా పుట్టినరోజు ప్రపంచమంతా..పండుగ జరపుకోవాలంటే నేనేమిచేయాలి..?!”
‘అద్వితీయ’అడిగిన తీరుకు’..’ప్రథమ’కు ఒళ్ళంతా గరిపొడిచినట్లైంది.
కొడుకును దగ్గరికి తీసుకుని నుదుటిపై ముద్దిచ్చి..” ఆలోచన వచ్చింది కదా..ఆ సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే..అసలు ఎప్పుడు ఏది చేయాలో తెలిసి దానిని ఆనందంగా సక్రమంగా చేయటమే పండుగ..ఇంకా అందరూ ఆనదంగా ఉండే రోజును పండుగలా ఉంది అంటాంకదా..” ఏదో చెప్పబోతుంటే..
” ఆగమ్మా చనిపోయిన రోజును కూడా గుర్తుపెట్టుకుని పండుగలా చేసుకోవటం దేనికి..?! “
” చనిపోయిన ఆ ఆత్మ శాంతికి గౌరవార్థం..నాన్నా..!”
” ఓహో..మరి పుట్టిన రోజు..చనిపోయిన రోజూ రెండూ పండుగలే అయితే పండుగ కాని రోజేదమ్మా..!”
” ప్రతి రోజు..ప్రతి  నిముషం పండుగే బంగారూ..స్కూల్ కి టైం అవుతుంటే ఇంకా అలానే ఉన్నావేం నాన్నా..!? ”
మరి అలా స్కూల్ కి వెళ్ళాడు ‘అద్వితీయ’ ఆ  రోజు..!
అలా అలా..ఇప్పుడు ‘అద్వితీయ’ కు పదహారేళ్లు వచ్చాయి. పండుగకు సరైన అర్థం ఇంకా
దొరకలేదు అద్వితీయకు.
ఒకరోజు ఓ గుడి దగ్గర కొన్ని మేకలను కొన్ని కోళ్ళను బలి ఇస్తూ డాన్సులు చేస్తున్నారు చాలా మంది ఆడ మగ.అదేదో అమ్మవారి పండుగట.అది చూసిన అద్వితీయకు గుండె తరుక్కుపోయింది.
రెండు రోజుల తరువాత ‘అద్వితీయ’ రోడ్డుమీద యాదాలాపంగా నడుస్తుంటే దగ్గరలో ఉన్న గుడి మైకులోంచి..
” మానవులెవరూ మాంసాహారం తినకూడదు..జంతువులను చంపి పండుగ చేసుకోవటమా..రామచంద్రా..! అది మహా రాక్షసత్వం..మానవులు ఎంత సాత్వికాహారం తింటే అంత హాయిగా ఆరోగ్యంగా ఉంటారు.మనతో పాటు సమస్త జీవరాశులను ఆనందంగా ఉంచిన రోజే మనకు నిజమైన పండుగ.మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఒక పూట చక్కగా ఏవైనా పండ్లు తిన్న రోజే పండుగ..” మరి ఇంక ఆ మాస్టర్ చెప్పేది ఆసాంతం శ్రద్ధగా వింటే ‘అద్వితీయ’కు ప్రతి క్షణం పండుగలా ఎలా గడపాలో మాత్రమే కాకుండా తన పుట్టిన రోజును ప్రపంచమంతా పండుగ చేసుకోవాలంటే ఏం చేయాలో బోధపడింది.
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

Read More →