” సర్..! ఈ పాపకు ఇండియాలో చికిత్స సాధ్యపడదు..అమెరికాకు ఒక 24 గంటలలోగా చేర్చితే ఏమైనా ట్రై చేయవచ్చు..” హైదరాబాద్ లో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో వచ్చిన రెస్పాన్స్ అది..మరి ఓ మహా కోటీశ్వరుడి కూతురు కేవలం 5 సంవత్సరాల పాప..చూస్తుండగానే కళ్ళముందు ఆ చిన్నారి బంగారు ప్రాణాలు చేయి దాటి పోయాయి..
” ఏమిటి జీవితం..ఇన్ని కోట్ల ఆస్తి ఉండి నా కన్న బంగారును.. బ్రతికించుకోలేకపోయానే..ఇంతేనా..మనిషి చేతుల్లో ఏమీలేదా..?!అసలు భగవంతుడు ఎక్కడ..?!
నేను ఎవరికి అన్యాయం చేసాను..?! నా బంగారు తల్లి ఏం పాపం చేసిందని..ఎందుకిలా జరిగింది..?! ఖర్మ అని సరిపెట్టుకోవాలా..!? మరణరహస్యం మనిషికి దొరకదా..!?దానాలు..ధర్మాలు..యజ్ఞాలు అన్నీ వృధాయేనా..చీమకైనా హాని చేయని చిన్నారి కన్నతల్లికి..
ఎందుకిలా జరిగింది..?!” తండ్రి మనసు వికలమైంది.
ఇక తల్లి మానసిక పరిస్థితి వర్ణనాతీతం ..అవాక్కై చూస్తుండింది..ఒక పెద్ద షాక్ ఆమెకు.
ఫలితంగా ఆ పాప ”పరా” పేరిట.. ” ఆదిపరాశక్తి ఫ్రీ మల్టీ స్పెషాలిటీ..” హాస్పిటల్ ఒకటి అత్యాధునిక సౌకర్యాలతో సాధారణ ప్రజలకు కూడా అద్భుతంగా ఉపయోగపడేందుకు
హైదరాబాద్ నగరంలో..విశ్వ విఖ్యాత డాక్టర్స్ తో వెలసింది..! అది క్రమంగా ”పరా..” హాస్పిటల్స్ గా ప్రసిద్ధి చెందింది..ఎందఱో కోటీశ్వరులకు ఆదర్శ ప్రాయంగా..నిలచింది.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.