Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0014..”ద రియల్ హీరో..!”

By   /  July 20, 2016  /  No Comments

    Print       Email

movies-5‘చందన్’డిగ్రీ వరకు చదువుకున్నాడు..అతనికి సినిమా హీరో కావాలని కోరిక.. సినిమా యావలో.. ఉన్న కొంచెం ఆస్తి కరిగిపోయింది కర్పూరంలా..! అతని భార్య ‘ఉత్పల’ ఏదో చిన్న ఉద్యోగం చేస్తోంది..!

”చందన్ నువ్వూ ఏదో చిన్న ఉద్యోగం చూసుకోబ్బా..ఎందుకొచ్చిన సినిమా గొడవ.. నా హీరో కదా..! ” స్వీట్ గా చెప్పింది..!
‘చందన్’ ఏమీ మాట్లాడకుండా ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వి ఊరుకున్నాడు..!
” నీ ఆలోచన మంచిదే..టాలెంట్ కేమీ తక్కువ లేదు..మరి కాలం కలసిరానప్పుడు మనమే దానితో కల్సి ప్రయాణించాలి కదా..ప్లీజ్..నా మాట కాస్త వినవా..! ”అనునయంగా అడిగింది  ‘ఉత్పల’.
అలా ఎన్నోసార్లు ఎన్నోరకాలుగా చెప్పి చూసింది.
‘చందన్’ సన్నగా నవ్వి ఊరుకోవడం తప్ప జవాబు చెప్పేవాడు కాదు..కాలేజీ రోజుల్లో తనే స్వయంగా ఎన్నో చక్కని నాటకాలు వ్రాసి..స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఎన్నో మెడల్స్ సాధించిన తన ప్రతిభ పై తనకు గట్టి విశ్వాసం ఉంది..తీవ్రమైన పట్టుదలతో తిరుగుతున్నాడు..హీరో అవటమే లక్ష్యంగా..!
‘ఉత్పల’అతని హీరోయిజాన్ని చక్కని వ్యక్తిత్వాన్ని నచ్చే ప్రేమించి మరీ పెళ్ళి చేసుకుంది..!నాలుగేళ్ళు గడిచినా అతనికెలాంటి టర్నింగ్ పాయింట్ రాలేదు..! పిల్లలు కలగలేదు..
ఇంట్లో ఆర్ధిక పరిస్థితికి మరి తోటివారి వేళాకోలాలకి  తట్టుకోలేక భర్తతో చెప్పుకోలేక..ఒకరోజు ఉన్నట్టుండి చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది..ఎవ్వరేమన్నా అనుకున్నా ‘చందన్’ చెవికి ఎక్కలేదు..అతని ఏకైక లక్ష్యం హీరో కావటం..!
మరో ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి..!
ఎలానో ‘చందన్’ మంచి హీరో అయ్యాడు..వరుసగా ఏడెనిమిది హిట్స్ సాధించాడు..!
ఒక రోజు ఒకావిడ ఏడేళ్ళ పాపతో వచ్చి ఓ కవర్ లాంటిది అతని ఇంటిముందు వాచ్ మెన్ కి ఇచ్చింది..! కొద్దిసేపటికి ఆమెకు లోపలి పిలుపొచ్చింది.
” మన పాప..! ” చెప్పింది..ఉత్పల..నవ్వి ఊరుకున్నాడు ‘చందన్’..!
”మరి మేము మీతో ఉండచ్చా..!? ”  అడిగింది ‘ఉత్పల’..!
”క్షమించండి మీకు చెప్పకుండా వెళ్ళటం నాది తప్పే..!” మళ్ళీ తనే తల వంచుకుని అందామె..!
 పాపను ముద్దు చేస్తూ ”బంగారు ‘పరిమళా’ నా చిట్టికన్నా..!”అని దగ్గరికి తీసుకున్నాడు..ఆమెకే జవాబు ఇవ్వకుండా..!
” చందన్……. …” కన్నీటి పర్యంతమై అతని భుజం మీద వాలింది ‘ఉత్పల’ ..!
పాప పుడితే ‘పరిమళ’ అని.. బాబు పుడితే ‘పరిమళ్’ అని పేరు పెట్టాలని వాళ్ళిద్దరూ అనుకున్న సందర్భం గుర్తొచ్చి..’చందన్’ ఆవిషయం మరచి పోకుండా అలా పాపను పిల్చి ముద్దుచేసేసరికి ‘ఉత్పల’ మనసు ఉద్వేగాన్ని భరించలేకపోయింది..!
”చందన్..నీకు నా మీద కోపం రాలేదా..!?”  అమాయకంగా అడిగిందామె..!”
‘చందన్ ‘ నవ్వులో ఏమీ తేడా లేదు..!
” పిచ్చి పరిమళా..! నేనే నీ మాట వినకుండా నిన్నెంతో కష్ట పెట్టాను నిజానికి..అది ఓవర్ ఐపోయింది..వెళ్ళినప్పుడు చెప్పకుండా వెళ్లావు.. ఓకే..రావటం పిలవకుండానే వచ్చేసావుగా..ఇది నీ ఇల్లు..నేను నీ వాణ్ణి..యాజ్ యూ లైక్..అంతా నీ ఇష్టం..! ”చెప్పాడు ‘చందన్’ అతి మామూలుగా..!
” ఓ మై డియర్ …! ” అంటూ అతని భుజం మీద వాలింది..”ఉత్పల”..!
ఆమె భుజం చుట్టూ ఓ చేయి వేసి మరో చేత్తో పాపను దగ్గరికి హత్తుకున్నాడు ”చందన్”..
” ది రియల్ హీరో..! ”
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →