Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0017.”క మిట్ మెంట్..!”

By   /  July 24, 2016  /  No Comments

    Print       Email

chemanti” నాన్నా..ఓ నాన్నా..! నిన్నే డాడీ..” చాలా సీరియస్ గా ఆలోచిస్తున్న గ్రేట్ బిజినెస్ మాన్ ‘జగదీశ్వరరావ్’ ని కుదిపి మరి ఈ లోకంలోకి తీసుకొచ్చింది..కూతురు ‘ చేమంతి’..

” ఏంటి బంగారూ..ఏం కావాలమ్మా..! ” నవ్వుతూ అడిగారాయన..
అందంగా లేత బంగారు రంగులో మెరిసిపోతున్న పచ్చ చేమంతిలా ఉన్న కూతుర్ని చూడగానే ఆ తండ్రికి ఆమె పెళ్ళికి సమయం ఎంతో లేదనే భావన కలిగింది..!
M.Tech Civil..గోల్డ్ మెడలిస్ట్ ‘చేమంతి’ తల్లి లేని పిల్ల..కానీ ఆ లోతు లేకుండా పెంచాడు తండ్రి..అందుకే అతనికి ఇప్పుడు అలా తోచింది.
” ఏరా..నాన్నలూ..పిహెచ్ డీ..చేస్తావా..పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇస్తావా ..” ఓ ఫ్రండ్ లాగే అడిగారాయన..!
” రెండూ కాదు నాన్నా..నాకు రెండు సంవత్సరాల టైం కావాలి ప్లస్ నేను ఎంచుకున్న ప్రాజెక్ట్ కి మీ కోపరేషన్ కావాలి..! ” చాలా దృఢ నిశ్చయంగా ఉంది ఆమె గొంతు..!
” ఓ యస్..చెప్పమ్మా..నీ ఇష్టం ఎప్పుడు కాదన్నాను..నేనేం చేయాలో చెప్పు ..100% ఓకే .! ”
థాంక్యూ సో మచ్ డాడ్..! ”హాపీగా తండ్రి చేతులు తన బుగ్గలకు ఆన్చుకుని చెప్పింది..’చేమంతి’..!
” ఇంతకీ నేనేమి చేయాలో చెప్పలేదు..! ” ఉత్సుకతగా అడిగారాయన..!
” ఏం లేదు డాడీ..నేను చేయబోయే పనికి మీరు మీ డిగ్నిటీ అడ్డు రాకూడదు..! “
” ఓ షూర్..నువ్వేంటి చేయబోతున్నావమ్మా..నా బంగారు తల్లి ఏం చేసినా..నేను నొచ్చుకోవలసిన అవసరం రాదు..ఉండదు..ప్రొసీడ్ ..! ”
” గ్రీన్ అండ్ క్లీన్ సిటీ ప్రాజెక్ట్..డాడీ..” చెప్పిందామె..
” వెరీ నైస్..ఎంతమంది పని వాళ్ళు కావాలి ఎన్ని వాన్స్ కావాలి..ఎంత డబ్బు కావాలి..?! నువ్వు ఏ మాత్రం కస్తాపడకుండా నీ ఆశయం సిద్ధించడానికి ఏమైనా చేస్తాను తల్లీ..! “
అమాయకంగా చెబుతున్న తండ్రి కళ్ళల్లోకి చూస్తూ..
” అయ్యో ..పిచ్చి డాడీ..అదే మరి..అలా కాదు.. అలాగే డిగ్నిటీ ఫీలవకూడదనే చెప్పేది..జస్ట్ లీవ్ మీ అండ్ సీ..వీలయితే రేపు మార్నింగ్ ఆరు గంటలకి మాతో కాసేపు ఉండండి చాలు..! ”
తిరిగి చూస్తే..మరి ప్రొద్దుటే ఆర్ గంటలకి ఓ 50 మందిపైగా  యువతీయువకులు ‘చేమంతి’ ఫ్రండ్స్ పెద్ద పెద్ద బాగ్స్ తో ప్రత్యక్షమయ్యారు..! ఓ రెండు మున్సిపల్ వాన్స్ వచ్చాయి. అదంతా చూస్తున్న ‘జగదీశ్వరరావ్’ఎంత పరవశించాడో..!
రాత్రి ” ఫేస్ బుక్ ”లో ‘చేమంతి’ షేర్ చేసిన మాటర్ కి స్పందించి అలా కదిలి వచ్చిన యువత ” క్లీన్ అండ్ గ్రీన్ సేవాదళ్ ” గా ఎదిగి ” పచ్చని పరిశుభ్ర భారత్..” ని కేవలం తొమ్మిది నెలలలో సాధించి ఆదర్శ భారత్ గా తయారైంది..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →