Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0026″రియల్ గుడ్ లిఫ్ట్..! “

By   /  August 9, 2016  /  No Comments

    Print       Email

fa21a1d574c5666cb5ffdbe189491bb1అప్పుడు రాత్రి ఎనిమిదౌతోంది సమయం..ఓ సిగ్నల్ పడి ఉంది..టైమర్ 180 సెకన్లు చూపిస్తోంది..ఆగి ఉన్న RTC బస్ విండో లోంచి ఒక అమ్మాయెవరో..కాస్త గట్టిగా అడుగుతోంది..పక్కనే ఆగిఉన్న టూ వీలర్ పైన ఉన్న పెద్దాయన్ని..

” అంకుల్ లిఫ్ట్ ప్లీజ్..! ”
ఆ పెద్దమనిషి అటు ఇటు ఎవరా అని చూసేలోగా ” హాయ్ అంకుల్ నేనే..రావచ్చా మీతో ఇంటిదాకా..?! ” అడిగింది చాలా కాజువల్ గా..
” ఒకే నాన్నా కూర్చో..వెల్కం..” నవ్వుతూ అన్నాడు గానీ ఆ అమ్మాయిని సరిగా గుర్తు పట్టలేదు అతను ఆ చీకట్లో..పరిచయం ఉన్న పేస్ లాగే అయితే తోచింది..!
ఇంకా ఓ నిముషం ఉంది ట్రాఫిక్ సిగ్నల్ టైమర్..!
” ఒక్క సారి మీ సెల్ ఇవ్వండి అంకుల్..అమ్మకు ఫోన్ చేస్తాను..గాబరా పడుతుంది..నా ఫోన్ లో చార్జింగ్ ఐపోయింది..! ” అభ్యర్ధనగా అడిగింది..!
వెంటనే ఆయన ” పర్లేదమ్మా..మాట్లాడు..” నవ్వుతూ ఫోన్ ఇచ్చారు ఆమెకు..!
సిగ్నల్ ఓకే..బండి కదిలింది..ఆ అమ్మాయి మాట్లాడుతోంది..
” అమ్మా..వస్తున్నా..మన సందు చివరి అంకుల్ కలిసారు..ఇంకో 15 నిముషాల్లో ఇంట్లో ఉంటానమ్మా..కంగారు పడకూ..” అప్పుడర్థమైంది ఆ అమ్మాయెవరో ఆయనకి..! ఫోన్ తిరిగి ఇచ్చేసింది..!
” ఎక్కడ్నించి వస్తున్నావమ్మా..?! ” పెద్దాయన అడిగారామెను..!
” ఇంజనీరింగ్ థర్డ్ యియర్ లో ఉన్నా కదా..అంకుల్..ప్రాజెక్ట్ వర్క్ కోసం ఫ్రండ్స్ తో కల్సి చేసుకు వస్తున్నా..మా అమ్మకు నా గురించి కాస్త భయం..చీకటైతే నాకూ చాలా భయమే అంకుల్..అందుకే మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను..! ” చెప్పింది అసలు సంగతి.
” ఓ..అలాగా..నీకు బెస్ట్ ఫ్రండ్ ఎవరు..!? ” అడిగారాయన..కాస్త వెరైటీగా..
అతను అడిగిన తీరుకు కాస్త ఆగి..ఆలోచించి..
” ఉన్నారంకుల్..అది అదీ..నా బెస్ట్ ఫ్రండ్..నేనే..” చెప్పింది గలగలా నవ్వుతూ..!
” ఓ.. వెరీ నైస్..ఇంకా భయం దేనికమ్మా..బుక్కిష్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఈ సంగతి అర్థమైన వాళ్లకి..ఏ విషయంలో కూడా ఎలాంటి భయం ఉండే అవకాశం లేదు..! ”
” యస్..అంకుల్ చాలా అద్భుతంగా చెప్పారు.. మీనుంచి చాలా వినాలి..నేర్చుకోవాలి దిస్ ఈజ్ రియల్లీ ఏ గుడ్ లిఫ్ట్ ఫర్ మీ..అంకుల్..మరి మీ టైం తీసుకుని వస్తాను..” అని థాంక్స్ చెప్పి ఫోన్ నంబర్ తీసుకుని సెలవు తీసుకుంది.. ఆ అమ్మాయి.!!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →