Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

నీటిబుడగ..!

By   /  July 12, 2016  /  No Comments

    Print       Email

water_bubble_drop_by_pixelado08-d317k9b”ఎందుకంత కోపం..?! ఎవరి పట్ల..?! దేని మీద..?! నువ్వెక్కడున్నావో తెల్సా..ఎన్ని జన్మలుగా నువ్విక్కడ పడి గిలగిల కొట్టుకుంటున్నావో తెల్సా..?! ఆవేశాలూ..ఆగ్రహాలూ నిన్నెలా కాల్చుకు తిన్నాయో తెల్సా..?! ”

మాట్లాడుతున్నది ఎవరో కనపడక చుట్టూ పరికించి చూసాడు..సన్నటి నవ్వు వినపడింది.
” నిన్నే ఇలా చూడు..” ఓ బంగరు రంగు గులాబిపువ్వు నుండి ఆ మాటలు రావటం గమనించి ఆశ్చర్యంగా ఆగిపోయాడతను..!
” పిచ్చివాడా ఇన్ని ముళ్ళు నాతోనే ఉన్నా నేనెలా ప్రేమపూర్వకంగా నవ్వుతూ పరిమళిస్తూ రాలిపోతున్నానో చూడు..! ”
జీవితంలో మొదటిసారిగా ఒక పువ్వు మాట్లాడటం వింటున్న అతనికి తనలో ఏదో కొత్తగా జరుగుతున్నట్లు తోచింది..ఇంకా నిశితంగా గమనిస్తే..ఆ గులాబిమొక్క పాదులోకి  ప్రవహిస్తున్న నీటి నడుమ నుండి..
” ఈ భూమి గొప్ప పాఠశాల..మన శరీరమే ఒక అద్భుత ప్రయోగశాల..ప్రతి కణం ఒక దివ్యమైన మధుశాల..” చెప్పి భళ్ళున పగిలి మాయమైంది ఓ చిన్ని నీటిబుడగ..!
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →