Loading...
You are here:  Home  >  Community Events  >  Current Article

Sri Kala Sudha Telugu Association Ugadi Awards 2016

By   /  April 2, 2016  /  Comments Off on Sri Kala Sudha Telugu Association Ugadi Awards 2016

    Print       Email

jr ntr 1

8న ఉగాది పురస్కారాల ప్రదానో త్సవం..
శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 8న చెన్నైలో ఉగాది పురస్కారాల ప్రదానో త్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ‘బాపు రమణ’ పురస్కారం, ‘మహిళా రత్న’ పురస్కారాలు కూడా ప్రదానం చేయనున్నారు. సీనియర్‌ యాక్టర్ రాజేంద్రప్రసాద్‌ కు ‘బాపు రమణ’ పురస్కారం ఇవ్వనున్నారు. మరో సీనియర్‌ యాక్టర్ ఆమనికి ‘బాపు బొమ్మ’ పురస్కారం అందజేయనున్నారు. ఇక ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మానవ హక్కుల కమిషన చైర్మన్ జస్టిస్‌ టి.మీనాకుమారికి, ఎలికో హెల్త్‌ కేర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వనిత దాట్లకు ‘మహిళా రత్న’ పురస్కారాలు అందజేయనున్నారు.

InCorpTaxAct
Suvidha

 

మ్యూజిక్‌ అకాడమీ సెక్రటరీ డాక్టర్‌ పప్పు వేణుగోపాలరావు అధ్యక్షతన జరగనున్న ఈ వేడకకు చీఫ్ గెస్ట్ గా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరుకానున్నారు. అలాగే.. గౌరవ అతిథిగా ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు వీఎల్‌ ఇందిరాదత, విశిష్ట అతిథిగా ఢిల్లీ ఎన్‌ఐఐఎఫ్‌ సలహాదారు పీఎస్‌ ప్రకాష్‌రావు, ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సౌత ఈస్ట్‌ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్‌ చైర్మన్ మువ్వా పద్మయ్య హాజరు కానున్నారు. విజయ చాముండేశ్వరి జ్యోతిప్రజ్వలనతో ప్రారంభం కానున్న ఈ వేడుకకు సంస్థ అధ్యక్షుడు బేతిరెడ్డి శ్రీనివాస్‌ స్వాగతం పలుకుతారు. రాయపేటలో ఉన్న మ్యూజిక్‌ అకాడమీలో సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక ప్రారంభం కానుంది.

ఈ పురస్కారాలను ఇంకా సినీరంగానికి చెందిన పలు విభాగాల వారికి కూడా ప్రకటించారు.

ఉత్తమ నటుడు ఎన్టీఆర్‌ (టెంపర్‌)

ఉత్తమ నటి అనుష్క (రుద్రమదేవి)

ఉత్తమ ప్రతి నాయకుడు దగ్గుపాటి రానా (బాహుబలి)

స్పెషల్‌ జ్యూరి అవార్డ్స్‌ నిత్యా మేనన (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)

శర్వానంద్‌ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)

శివాజీ రాజా (శ్రీమంతుడు)

ఉత్తమ సహాయ నటుడు పోసాని కృష్ణమురళి(టెంపర్‌)

ఉత్తమ సహాయ నటి హేమ (కుమారి 21 ఎఫ్‌)

ఉత్తమ హాస్యనటుడు పృథ్వి (శంకరాభరణం)

ఉత్తమ నూతన నటుడు అక్కినేని అఖిల్‌ (అఖిల్‌)

ఉత్తమ నూతన నటి ప్రజ్ఞ జేస్వాల్‌ (కంచె)

ఉత్తమ చిత్రం శ్రీమంతుడు (మైత్రి మూవీ మేకర్స్‌)

ఉత్తమ సంచలనాత్మక చిత్రం బాహుబలి (శోభు యార్లగడ్డ)

ఉత్తమ కథ జాగర్లమూడి రాధాక్రిష్ణ (క్రిష్‌)(కంచె)

ఉత్తమ కళా దర్శకుడు ‘పద్మశ్రీ’ తోట తరణి (రుద్రమదేవి)

ఉత్తమ కథనం క్రాంతి మాధవ్‌ (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు)

ఉత్తమ దర్శకుడు కొరటాల శివ (శ్రీమంతుడు)

ఉత్తమ నూతన దర్శకుడు వంశీకృష్ణ (దొంగాట)

ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ (ఖి/0 సత్యమూర్తి,శ్రీమంతుడు)

ఉత్తమ ఛాయాగ్రహకుడు సెంథిల్‌ కుమార్‌ (బాహుబలి)

ఉత్తమ మాటల రచయిత సాయిమాధవ్‌ బుర్రా (మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, కంచె,
గోపాల… గోపాల, దొంగాట)

ఉత్తమ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర (రుద్రమదేవి)

ఉత్తమ గాయకుడు సాగర్‌ (ఖి/0 సత్యమూర్తి, శ్రీమంతుడు)

ఉత్తమ గాయని రమ్య బెహరా (బాహుబలి)

ఉత్తమ బాల నటి జ్వాల మేఘన (గోపాల… గోపాల)

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →