Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Sri Krishnadevaraya University Vice Chancellor Rajagopal Resigned, Likely to join Janasena

By   /  April 10, 2018  /  Comments Off on Sri Krishnadevaraya University Vice Chancellor Rajagopal Resigned, Likely to join Janasena

    Print       Email

జేడీ ల‌క్ష్మినారాయ‌ణ

InCorpTaxAct
Suvidha

బాట‌లో మ‌రికొంత‌మంది

 

 

 

 

* త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ యూనివ‌ర్సిటీ వైస్ ఛాన్స్‌ల‌ర్ రాజ‌గోపాల్‌

* జేడీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా స్వాగ‌తిస్తాం

డెక్క‌న్ అబ్రాడ్‌: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించకముందే.. ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమంటూ మరికొంత మంది ప్రభుత్వ ఉన్నతాధికారులు ముందుకొస్తున్నారు. లక్ష్మీనారాయణతో కలసి నడిచేందుకే తన పదవికి రాజీనామా చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ కె. రాజగోపాల్ వెల్లడించారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు 3 రోజుల కిందటే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇంతకుముందు చెప్పారు. అయితే నిన్న‌ వర్శిటీకి వచ్చిన రాజగోపాల్.. తన రాజీనామాకు గల అసలు కారణాన్ని వెల్లడించారు. ‘సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వీఆర్ఎస్ తీసుకున్నార‌ని, ఆయన ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశ్యంలో ఉన్నార‌ని,  ఆయనకు సాయం చేసేందుకే పదవికి రాజీనామా చేసిన‌ట్లు రాజ‌గోపాల్ తెలిపారు. లక్ష్మీనారాయణ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇంకా తెలియదని రాజ‌గోపాల్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా.. తన హయాంలో వర్సిటీలో జరిగిన పనుల గురించి రాజగోపాల్ వివరించారు. తన పదవీకాలంలో వర్శిటీలో ఎన్నో మార్పులు తీసుకొచ్చానని, ఆ మార్పులే భవిష్యత్తులో వర్సిటీని అగ్రగామిగా నిలుపుతాయని అన్నారు. తనకు సహకరించిన పాలకమండలి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.  కాగా ప్ర‌స్తుత ప‌రిణామాలు చూస్తా ఉంటే జేడీ ల‌క్ష్మినారాయ‌ణ ఏ పార్టీలో చేర‌ర‌ని, త‌నే ఒక కొత్త పార్టీ పెట్టే ఉద్దేశంలో ఉన్నార‌ని అర్థ‌మవుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Tips for Surviving the Coronavirus Pandemic

Read More →