Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Sri Reddy Reveals Secrets of Tollywood Industry

By   /  April 11, 2018  /  Comments Off on Sri Reddy Reveals Secrets of Tollywood Industry

    Print       Email

సాక్ష్యాలు బ‌య‌ట పెట్టిన శ్రీ‌రెడ్డి

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* సురేశ్ బాబు చిన్న కుమారుడు అభిరామ్‌తో ఉన్న ఫోటోలు విడుద‌ల‌

* హాట్‌టాపిక్‌గా మారిన శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం

* సినీ ఇండ‌స్ట్రీలో ఒక‌టేచ‌ర్చ‌

డెక్క‌న్ అబ్రాడ్‌: శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారం సినీ ఇండ‌స్ట్రీలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. గ‌త కొద్ది రోజులుగా టీవీ డిబెట్‌ల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఎప్పుడు  ఎవ‌రి గురించి మాట్లాడుతుందోన‌ని సినీ ఇండ‌స్ట్రీలోని పెద్ద‌లు భ‌య‌ప‌డుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు. తాజాగా ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ ఫొటోలను విడుదల చేసేసింది. ఇప్పుడీ ఫొటోల గురించి యావత్ సినీ ఇండస్ట్రీలో చర్చసాగుతోంది. ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సురేశ్ బాబు తనయుడు ఆయన స్టూడియోలోనే.. తనను దారుణంగా అనుభవించాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అయితే అందరూ ఈ విషయాన్ని అబద్ధమని అనుకున్నారని, అందుకే దానికి సంబంధించిన ఫొటోలను విడుదల చేస్తున్నానని చెప్పింది. మంగళవారం సాయంత్రం ఏకంగా అభిరామ్‌తో ఉన్న ఫొటోలను ఓ టీవీ చానెల్‌ డిబేట్‌లో, సోషల్ మీడియాలో లీక్ చేసేసింది శ్రీరెడ్డి. ఎలాంటి మార్ఫింగ్ లేకుండా విడుదల చేసింది. శ్రీరెడ్డి – అభిరామ్‌లు లిప్ లాక్ చేసుకుంటున్న సెల్ఫీతో పాటు మరో ఫొటోను కూడా లీక్ చేసింది.

కాగా ఇప్పటివరకూ ఆరోపణలకే పరిమితం అయిన శ్రీరెడ్డి ఇష్యూలో  ఫస్ట్ టైం సాక్ష్యాలతో సహా బయటపెట్టడంతో సినీ ఇండస్ట్రీ పెద్దలు, ప్రముఖులు కంగుతిన్నారు. నిజమేనా అన్నంతగా నోరెళ్లబెట్టారు. తనను వాడుకున్న ప్రతి ఒక్కరి భరతం పడతానన్న  శ్రీరెడ్డి అన్నంత పనిచేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. కాగా ప్రముఖ డైరెక్టర్లు, కొందరు పేరుగాంచిన ప్రొడ్యూసర్లు, వారి పిల్లలు శ్రీరెడ్డి లీకుల్లో ఉండటం గమనార్హం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

NATA Women’s Day @Charlotte – A Grand Success

Read More →