Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Sri Sri Sri Chinna Jeeyar Swamy meets Modi

By   /  July 18, 2016  /  Comments Off on Sri Sri Sri Chinna Jeeyar Swamy meets Modi

    Print       Email

pmmeetప్ర‌ధాని మోడీతో చిన‌జీయ‌ర్ భేటీ

 

InCorpTaxAct
Suvidha

 

 

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల‌న ఆద‌ర్శ‌వంతంగా ఉంద‌ని, విదేశాల్లో భార‌త ఖ్యాతిని మోడీ రెప‌రెప‌లాడిస్తున్నార‌ని త్రిదండి శ్రీ‌మ‌న్నారాయ‌ణ రామానుజ చిన‌జీయ‌ర్ స్వామి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. గతంలో భారతీయులమని చెప్పుకొనేందుకు ఇష్టపడవివారు కూడా ఇప్పుడు తాము భారతీయులమని సగర్వంగా చాటుకుంటున్నారన్నారు. నిన్న ప్ర‌ధాని మోడీతో భేటీ అయిన చిన‌జీయ‌ర్ స్వామి స‌మ‌తామూర్తి  రామానుజాచార్య స్వామి విగ్ర‌హ నిర్మాణం గురించి చ‌ర్చించారు. 40 నిమిషాల ఈ భేటీలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయ సమీపంలో ఏర్పాటు చేస్తున్న 216 అడుగుల రామానుజాచార్య స్వామి పంచలోహ విగ్రహం గురించి ప్రధానికి వివరించారు. వచ్చే ఏడాది రామానుజాచార్య సహస్ర జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని, వీటిలో భాగంగా జరిగే సమతామూర్తి విగ్రహావిష్కరణకు హాజరు కావాలని ప్రధానిని ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా చిన‌జీయ‌ర్ స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యుల సహస్ర జయంతిని పురస్కరించుకొని ఒక నాణేన్ని ముద్రించాలని విజ్ఞప్తి చేశామని, ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.

సమాజంలో ఉగ్రవాద భూతాన్ని అణచేందుకు దైవంపైన ఉండే ప్రేమను ఒక సాధనంగా తీసుకుని రామానుజాచార్య అద్భుతమైన సమతా సూత్రం ఇచ్చారన్నారు. ఈ సందేశాన్ని మననం చేసుకుంటూ, కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఆగస్టు 19వ తేదీన సమతా స్నానం చేసేందుకు కూడా హాజరు కావాలని మోదీని కోరామన్నారు. సమతా సూత్రాన్ని పునరుజ్జీవింపచేయటమే తమ ఉద్దేశమన్నారు. 1017వ సంవత్సరంలో జన్మించిన రామానుజాచార్య అప్పట్లోనే దళితులకు దేవాలయాల్లో దర్శనానికి అవకాశం కల్పించారని, ఆయన చేసిన పనులను మేధావులు సైతం సమర్థించారని తెలిపారు . కానీ, తర్వాత వచ్చిన వారు కుల, మతాలను అడ్డుపెట్టుకుని లబ్ధి కోసం ప్రయత్నించారన్నారు. ధర్మాన్ని రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారని, సమాజంలో ప్రగతి ప్రతిబింబించాలనేదే హిందూ ధర్మం ఆశయమని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →