తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా

చిత్రం : అల్లూరి సీతరామరాజు ,రచన-శ్రీ శ్రీ ,శ్రీ శ్రీ గారికి ఈ పాటకుగానూ జాతీయ బహుమతి లభించింది!గాయకులూ-ఘంటసాల,రామకృష్ణ
సంగీతం–ఆదినారాయణరావు గారు . ఈ గీత రచనకు గాను శ్రీశ్రీకి జాతీయ స్థాయిలో ఉత్తమ గీతరచయిత పురస్కారం లభించింది.
*****
తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చెయరా
దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా…
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా…
దారుణ మారణ కాండకు తల్లడిల్లవద్దురా…
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా…
నిదుర వద్దు బెదర వద్దు…
నింగి నీకు హద్దురా…
నింగి నీకు హద్దురా…
ఎవడు వాడు ఎచ్చటి వాడు
ఇటు వచ్చిన తెల్లవాడు
కండ బలం గుండె బలం కబలించిన దుండగీడు
మాన ధనం ప్రాణ ధనం దోచుకున్న దొంగవాడు
ఎవడు వాడు ఎచ్చటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు
తగిన శాస్తి చెయ్యరా…
తరిమి తరిమి కొట్టరా…
ఈ దేశం… ఈ రాజ్యం
నాదేనని చాటించి…
నాదేనని చాటించి…
ఫ్రతి మనిషి తొడలు కొట్టి
శ్రుంఖలాలు పగలగొట్టి
చురకత్తులు పదను పట్టి
తుది సమరం మొదలుపెట్టి
సింహలై గర్జ్జించాలీ…
సంహారం సాగించాలీ…
వందేమాతరం..వందేమాతరం
ఓ… స్వాతంత్ర వీరుడా స్వరాజ్య భానుడా …
అల్లూరి సితారామ రాజా… సితారామ రాజా
అందుకో మా పూజలందుకో రాజా…
అందుకో మా పూజలందుకో రాజా…
అల్లూరి సితారామ రాజా
ఓ… తెల్లవారి గుండెల్లొ నిదురించిన వాడా…
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా…
త్యాగాలే వరిస్తాం… కష్టలే భరిస్తాం…
నిశ్చయముగా నిర్భయముగా నీ వెంటనే నడుస్తాం…
ఆ పాటను ఇక్కడ https://www.youtube.com/watch?v=8oTbzver_c0 వినండి!
*****
పి.ఆదినారాయణరావు

పెనుపాత్రుని ఆదినారాయణరావు (ఆగష్టు 21, 1914 – జనవరి 25, 1991) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నిర్మాత. ఇతడు భార్య, సుప్రసిద్ధ నటి అంజలీదేవి పేరుతో స్థాపించిన అంజలీ పిక్చర్స్ అధినేత.
ఈయన ఆగష్టు 21 1914 సంవత్సరంలో విజయవాడ లో కృష్ణాష్టమి రోజున జన్మించారు.
చిన్ననాడే శ్రీ రాజరాజేశ్వరి నాట్యమండలి వారి ‘సావిత్రి’ నాటకంలో నారదుని పాత్ర పోషించారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన ‘పెదగురువు’ అనే పట్రాయని నరసింహశాస్త్రి వద్ద గాత్రం, హార్మోనియం వాయిద్యాలలో శిక్షణ పొందారు. తరువాత కాకినాడ మెక్లారిన్ ఉన్నత పాఠశాలలో మెట్రిక్ చదివారు. అప్పుడు అమెచ్యూర్ అసోసియేషన్, బర్మాషెల్ అసోసియేషన్ సంస్థలకు రచన, సంగీత బాధ్యతలు వహించేవారు. ఆ తరువాత సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన గొల్లభామ చిత్రానికి గీత రచయితగా చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1950లో బి.ఎ.సుబ్బారావు నిర్మించిన పల్లెటూరి పిల్ల చిత్రానికి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించారు. అర్ధాంగి అంజలీదేవి పేరుతో 1953లో అంజలీ పిక్చర్స్ స్థాపించారు. 1955లో నిర్మించిన అనార్కలి చిత్రం వీరిని ఉత్తమ నిర్మాతల కోవలోకి చేర్చింది. ఇందులోని ‘రాజశేఖరా నీపై మోజు తీరలేదురా’ అనే మధుర గీతం ఈయన సంగీత బాణీకి ఒక మచ్చుతునక. తరువాత 1957లో రూపొందించిన సువర్ణసుందరి తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్వర్ణోత్సవాలు జరుపుకున్న సంగీత రసకలశం. సతీ సక్కుబాయి వీరి కీర్తి కిరీటాన మరో కలికితురాయి.
ఈయన 1991 సంవత్సరంలో జనవరి 25 న పరమపదించారు.
(సేకరణ)
టీవీయస్.శాస్త్రి

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.