Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Srilankan Leader was not taken care properly in Tirumala

By   /  August 22, 2016  /  Comments Off on Srilankan Leader was not taken care properly in Tirumala

    Print       Email

Tirumalaదేశ అధ్య‌క్షుడికి అవ‌మానం!

 

InCorpTaxAct
Suvidha

 

 

కలియుగ దైవం వెంకన్నను దర్శించుకునేందుకు ప్ర‌పంచ దేశాల నుంచి ఎంతోమంది అధ్య‌క్షులు వ‌స్తుంటారు. అయితే అక్క‌డి అధికారులు ఎవ‌రికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ వాళ్ల‌కు ఇస్తూ అతిథి మ‌ర్యాద‌లు చేస్తుంటారు. అయితే  తాజాగా ఒక దేశ అధ్య‌క్షుడికి తిరుమ‌ల‌లో అవ‌మానం జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కుటుంసభ్యులతో  సహా శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల వ‌చ్చారు. అయితే ఆయ‌న‌కు శ్రీ‌వారి దర్శనం కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న మైత్రిపాల ఆలయం బయటకు వచ్చారు. కానీ అక్కడ డ్రైవర్ లేకపోవడంతో కారులోనే కూర్చొవాల్సి వచ్చింది. ఇలా పది నిమిషాల పాటు కూర్చున్నారు. దర్శనం కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు దేశధ్యక్షుడికి సిబ్బందిని పెట్ట‌డం మ‌రిచిపోయారు. కారు డ్రైవర్ కోసం సిరిసేన ఏకంగా పదినిమిషాలపాటు వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు చూపిన ఈ అలసత్వంపై భక్తులు సైతం మండిపడుతున్నారు.

పొరుగు దేశాధ్యక్షుడికి జరిగిన ఇబ్బందికర పరిణామం వార్తల రూపంలో వెలుగులోకి రావ‌డంతో అంతా ఆశ్చర్యపోయారు.  ఓ దేశాధ్యక్షుడు వేచి చూసేలా చేసిన ఆలయ అధికారుల తీరుపై ఆయన భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న అర్బన్ ఎస్పీ జయలక్ష్మి మండిపడ్డారు. ప్రముఖుల పర్యటనలో సమన్వయం లోపిస్తే అబాసుపాలు కావాల్సి వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →