Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

SriRamaNavami – Kalyaanam at Badraadri

By   /  March 25, 2018  /  Comments Off on SriRamaNavami – Kalyaanam at Badraadri

    Print       Email

భ‌ద్రాద్రిలో నేడు రాములోరి క‌ల్యాణం

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* స‌ర్కార్ త‌ర‌పున ప‌ట్టువ‌స్త్రాలు, ముత్యాల త‌లంబ్రాలు

* భ‌ద్రాద్రికి పోటెత్తిన భ‌క్తులు

డెక్క‌న్ అబ్రాడ్‌: భ‌ద్రాద్రిలో రాములోరి క‌ల్యాణం సంద‌ర్భంగా ఈ రోజు మిథిలా స్టేడియం ప్రాంగ‌ణంలో చ‌లువు పందిళ్ల‌ను సిద్ధం చేసి చాందినీ వస్ర్తాలు, తోరణాలతో అందంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో రామాలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి. మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు శ్రీ‌సీతారాముల వివాహ వేడుక వైభ‌వోపేత‌గా జ‌ర‌గ‌నుంది. కాగా తెలంగాణ ప్ర‌భుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు అందజేయనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మిథిలా ప్రాంగణంలో శ్రీరామపట్టాభిషేకం నిర్వహించనున్నారు. సీతారాముల ఉత్సవమూర్తులను ఆలయంనుంచి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చి మహాపట్టాభిషేకం జరుపుతారు.

కాగా రాములోరి క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు భద్రాద్రి  ఆల‌యానికి చేరుకుంటున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం వద్ద క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రగా వచ్చిన భక్తులు కూడా స్వామివారి ఉచిత దర్శనం వద్ద గంటల తరబడి వేచిచూడాల్సి వ‌స్తోంది. ఇప్పటికే వందలాది మంది పోలీసులు బందోబస్తుకు సిద్ధమయ్యారు. సీతారాముల కల్యాణం అనంతరం ముత్యాల తలంబ్రాలను వచ్చిన భక్తులందరికి పంపిణీ చేసేందుకు ఈవో ప్రభాకర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటుచేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →