Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

SriRamaNavami

By   /  March 25, 2018  /  Comments Off on SriRamaNavami

    Print       Email

తెలుగు రాష్ట్రాల్లో శ్రీ‌రామ న‌వమి

InCorpTaxAct
Suvidha

 

 

 

 

* ఏపీలో 25, తెలంగాణ‌లో 26న‌
* భ‌ద్రాచ‌లంలో 26న‌, ఒంటిమిట్ట 30న కోదండ‌రామ‌స్వామి వారి క‌ల్యాణోత్స‌వం
డెక్క‌న్ అబ్రాడ్‌: ఈ ఏడాది అన్ని పండుగల తేదీలపై గందరగోళం నెలకొంది. సంక్రాంతి, మహాశివరాత్రితోపాటు తాజాగా శ్రీరామ నవమి నిర్వహణపై ధర్మ సందేహం ఉత్పన్నమైంది. శ్రీరామ నవమిని మార్చి 25 న? లేదా 26 న నిర్వహించుకోవాలా? అనే సందేహం భక్తుల్లో కలిగింది. ఎందుకంటే ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరు తేదీల్లో ఈ పండుగను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో ఈ గందరగోళం నెలకుంది. వాస్తవానికి టీటీడీ ప్రచురించిన క్యాలెండర్ ప్రకారం మార్చి 25 న శ్రీరామ నవమి అని ఉంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 26 న భద్రాచలంలో సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఏపీ మాత్రం టీటీడీ క్యాలెండర్‌నే అనుసరించనుంది. మార్చి 25వ తేదీనే ఎందుకు నిర్వహించుకోవాలనే కారణాలను సైతం వివరించింది. చైత్రశుద్ధ నవమి తిథి మార్చి 25 న సూర్యోదయం తర్వాత వస్తుంది. మార్చి 26 న సూర్యోదయానికి ముందే ముగిసి, ఆ సమయానికి దశమి వచ్చేస్తుంది.

కాబట్టి ముందు రోజునే నవమి వేడుకలను నిర్వహించాలని ధర్మసింధు చెబుతోందని పేర్కొన్నారు. ఉత్తరాదిన కూడా మార్చి 25 నే శ్రీరామ నవమి వేడుకలు జరపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ భద్రాద్రి ఒంటిమిట్టలో కోదండరామస్వామి వారి కల్యాణోత్సవం మార్చి 30 న నిర్వహించనున్నారు. భద్రాచలంలో నవమి రోజు కల్యాణం నిర్వహిస్తే, ఇక్కడ మాత్రం చైత్ర పౌర్ణమి రోజున స్వామివారికి కల్యాణం జరుగుతుంది. అయితే, తెలంగాణాలోని వేద పండితులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. అష్టమితో కూడిన నవమి పనికిరాదని కూడా ధర్మసింధు స్పష్టం చేస్తోందని అంటున్నారు. ఆ ప్రకారమే, భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు తెలంగాణ ప్రభుత్వం 26 న స్వామివారి కల్యాణం జరిపించనుందని వారు అభిప్రాయపడ్డారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →